మమతకు బైబై చెప్పిన 13మంది ఎమ్మెల్యేలు

2 Feb, 2021 17:28 IST|Sakshi

కోల్‌కత్తా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప‌శ్చిమ‌బెంగాల్‌లో రాజకీయాలు రంజుగా మారాయి. ఇప్పటికే కేంద్ర బడ్జెట్‌లో అత్యధికంగా బెంగాల్‌కు కేటాయింపులు జరగడంతో బీజేపీ ఉత్సాహంగా ఉంది. దీంతో పాటు అధికార తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు పెరగడంతో బీజేపీ జోరు మీద ఉండగా ఎమ్మెల్యేల జంపింగ్‌తో ఆ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డీలా పడ్డారు. తాజాగా మరో ఎమ్మెల్యే టీఎంసీని వీడి బీజేపీలోకి చేరారు.

మమతాబెనర్జీకి అండదండగా ఉన్న సువేందు అధికారి, రాజీవ్ బెన‌ర్జీతో స‌హా మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు తృణ‌మూల్‌ కాంగ్రెస్‌ను వీడారు. తాజాగా మ‌రో ఎమ్మెల్యే కూడా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆయనే డైమండ్ హార్బ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యే దీప‌క్ హ‌ల్దార్. పార్టీలో త‌న‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేదని చెప్పి సోమవారం తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి మంగళవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ నాయకులు ముకుల్ రాయ్‌, సువేందు అధికారి స‌మ‌క్షంలో దీప‌క్ హ‌ల్దార్‌ బీజేపీలో చేరారు. ఆయనతో కలిపి మొత్తం 13 మంది తృణమూల్‌ కాంగ్రెస్‌ను వీడడంతో మమతా బెనర్జీ డీలా పడ్డారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ నిరాశలో ఉంది.

మరిన్ని వార్తలు