జవాబు పత్రమే ఇచ్చి పరీక్ష రాయమంటే..! 

1 May, 2022 09:31 IST|Sakshi

తిరువనంతపురం: పరీక్షల్లో ఎవరికైనా ప్రశ్నపత్రం ఇచ్చి జవాబులు రాయమంటారు. కానీ కేరళ యూనివర్సిటీ పరీక్షలో మాత్రం విద్యార్థికి ఏకంగా జవాబు పత్రమే ఇచ్చి పరీక్ష రాయమన్నారు. ఇంకేముంది.. ఆ విద్యార్థి  ఎంచక్కా పరీక్ష రాసేసి వెళ్లిపోయాడు. ఈ విషయం కాస్త ఆలస్యంగా గుర్తించిన వర్సిటీ పరీక్ష రద్దు చేసింది. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్‌ నాలుగో సెమిస్టర్‌ చదువుతున్న ఓ విద్యార్థి కరోనా వల్ల ‘సిగ్నల్‌ అండ్‌ సిస్టమ్స్‌’పరీక్షకు హాజరుకాలేకపోయాడు.

అతని కోసం ఈ ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహించారు. ఎగ్జామినేషన్స్‌ కంట్రోలర్‌ ఆఫీస్‌ పొరపాటున ప్రశ్నపత్రానికి బదులు జవాబు పత్రం ముద్రించి పంపింది. ఇన్విజిలేటర్‌ కూడా దాన్నే విద్యార్థికి ఇచ్చాడు. పేపర్‌ దిద్దిన ప్రొఫెసర్‌ జరిగిన పొరపాటును గుర్తించి  పైఅధికారులకు తెలిపాడు.   దాంతో ఆ ఎగ్జామ్‌ను రద్దు చేసిన  మే మూడో తేదీన మరోసారి పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించింది.  పొరపాటుపై వర్సిటీ విచారణకు ఆదేశించింది. 

మరిన్ని వార్తలు