దేశ రక్షణలోకి 'స్మార్ట్‌'గా...

5 Oct, 2020 17:01 IST|Sakshi

ఒడిశా: భారత్‌ సైనికుల చేతిలోకి మరో ఆయుధం చేరింది. 'సూపర్‌సోనిక్‌ మిస్సైల్‌ అసిస్టెడ్‌ రిలీజ్‌ ఆఫ్‌ టోర్పెడో '(స్మార్ట్‌)ను ఒడిశాలోని వీలర్‌ ఐలాండ్‌లో విజయవంతంగా పరీక్షించారు. ఈ క్షిపణికి సంబంధించిన అన్ని లక్ష్యాలు అనుకున్న స్థాయిలో ఉన్నాయని డీఆర్‌డీవో అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ డీఆర్‌డీవోకు అభినందనలు తెలిపారు. సాంకేతిక పరంగా ఇది గొప్ప విజయమని...యుద్ధ సమయంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 'యాంటీ సబ్ ‌మెరైన్‌ వార్‌ఫేర్‌ ఆపరేషన్స్‌'లో స్మార్ట్‌ క్షిపణి కీలకంగా వ్యవహరిస్తుంని డీఆర్‌డీవో ఛైర్మన్‌ డి. సతీశ్‌ రెడ్డి అన్నారు. ఈ నెల ఆరంభంలో 'లేజర్‌ గైడెడ్‌ యాంటీ ట్యాంక్‌' క్షిపణిని డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది. 
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా