కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా అనూప్‌ చంద్ర

9 Jun, 2021 08:36 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్‌ అధికారి అనూప్‌ చంద్ర పాండే కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. అనూప్‌ చంద్ర నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేశారని కేంద్ర న్యాయశాఖ మంగళవారం వెల్లడించింది.

ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన సునీల్‌ అరోరా ఈ ఏడాది ఏప్రిల్‌ 12న పదవీ విరమణ చేయడంతో ఈ ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం సుశీల్‌ చంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ కాగా, రాజీవ్‌ కుమార్‌ ఎన్నికల కమిషనర్‌గా ఉన్నారు. ఎలక్షన్‌ కమిషన్‌లో మొత్తం ముగ్గురు సభ్యులు ఉంటారు.

(చదవండి: యూఎన్‌ ప్రధాన కార్యదర్శిగా రెండోసారి ఈయనే!)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు