Anurag Thakur: 24 గంటలు టైమ్‌ ఇస్తున్నా.. కేజ్రీవాల్‌కు కేంద్ర మంత్రి ఠాకూర్‌ సవాల్‌

20 Aug, 2022 16:09 IST|Sakshi

Anurag Thakur.. దేశ రాజధాని ఢిల్లీలో పొలిటికల్‌ వాతావరణం హీటెక్కింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ, బీజేపీ నేతల మధ్య మాటల వార్‌ నడుస్తోంది. కాగా, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాలో ఇంట్లో సీబీఐ సోదాలు హాట్‌ టాపిక్‌ మారింది. ఈ నేపథ్యంలో ఆప్‌ నేతలు బీజేపై విరుచుకుపడుతున్నారు. 

ఇదిలా ఉండగా.. తాజాగా ఆప్‌ సర్కార్‌పై కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి ఠాకూర్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎక్సైజ్ పాల‌సీ స్కాంలో మ‌నీష్ సిసోడియా తొలి నిందితుడే అయినా ఈ స్కాం ప్ర‌ధాన సూత్ర‌ధారి ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ అని ఆరోపించారు. కేజ్రీవాల్ మీడియా ముందుకు వ‌చ్చి 24 గంట‌ల్లోగా త‌న‌కు జవాబివ్వాల‌ని అనురాగ్ ఠాకూర్ స‌వాల్ విసిరారు. సిసోడియాకు కేవ‌లం డబ్బు వ్యామోహంతో మనీ తీసుకుని మౌనంగా ఉంటున్నాడ‌ని.. మనీశ్‌ సిసోడియా తన పేరును ‘మనీ-ష్‌’గా మార్చుకోవాలని సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. విలేక‌రుల స‌మావేశానికి హాజ‌రైన మ‌నీష్ సిసోడియాకు ముఖం చెల్ల‌లేద‌ని మీడియా అడిగిన ప్ర‌శ్నలకు సమాధానం ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. 

మరోవైపు.. ఆప్‌ నేతలు మాత్రం బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రజలకు మంచి చేస్తే బీజేపీకి నచ్చదంటూ వ్యాఖ్యానించారు. అలాగే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో(2024 ఎన్నిక‌ల్లో) కేజ్రీవాల్, మోదీ మ‌ధ్యే పోటీ ఉంటుంద‌ని సిసోడియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసేందుకు ఇలా కేసుల్లో ఇరికిస్తున్నారని సిసోడియా మండిపడ్డారు. 

ఇది కూడా చదవండి: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు.. సీఎం పోస్టుకు రూ. 2,500 కోట్లు?

మరిన్ని వార్తలు