మంచిదే కానీ... అలాంటి యువకుడిని ఇంతవరకూ చూడలేదు!

30 Mar, 2022 14:29 IST|Sakshi

సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...!

ఒక్కరే తగ్గాలా?
పెళ్లి కోసం బరువు తగ్గాలనుకునే యువకుడిని నేను ఇంతవరకూ చూడలేదు. మరి పెళ్లిలో పర్ఫెక్టుగా ఉండాలనే ఒత్తిడిని ఇరు కుటుంబాలూ అమ్మాయి మీదే ఎందుకు పెడతాయి?
– అపర్ణ గోవిల్‌ భాస్కర్, బేరియాట్రిక్‌ సర్జన్‌

ఇదేనా తాలిబన్‌ 2.0?
తాలిబన్లు బాలికల పాఠశాలలను తెరవ డానికి తిరస్కరించారు, మహిళల ప్రయా ణాల మీద ఆంక్షలు విధించారు, ప్రభుత్వో ద్యోగులకు కఠిన డ్రెస్‌ కోడ్, గడ్డం తప్పనిసరి చేశారు. తాలిబన్లు మారతారని ఆశ పడిన వాళ్లు కొంచెం ఆగితే మంచిది.                                   
– స్టాన్లీ జానీ, పాత్రికేయుడు

రెండూ సాగుతున్నాయి
శ్రీలంకతో పోల్చితే భారతదేశ వ్యవసాయ విధానంలో ఒక తేడా ఉంది. శ్రీలంక మామూలు వ్యవసాయాన్ని ఆపేసి, దాన్ని సేంద్రీయ వ్యవసాయంతో మార్పిడి చేసింది. కానీ ఇండియాలో మామూలు వ్యవసాయంతో పాటు సేంద్రీయ వ్యవసాయం కూడా కొనసాగుతోంది.
– డి. ప్రశాంత్‌ నాయర్, ఇన్వెస్టర్‌

పోయింది స్వాతంత్య్రం!
ఆయుర్వేద వైద్యానికి విధి విధానాలను నిర్దేశించవలసింది భారతదేశమేగానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ కాదు. భారత్‌కు ఏ నియంత్రణా లేని అవినీతి మయ ప్రపంచ ఆరోగ్య సంస్థకు వాటిని అప్పజెప్పి ఆయుర్వేదం మీద ఉన్న స్వాతంత్య్రాన్ని వదిలేసుకుంది మోదీ ప్రభుత్వం. ‘ఫారెన్‌’ లేబుల్‌ ఉండటం కోసం వేసిన ఘోర తప్పుటడుగు ఇది.
– సంక్రాంత్‌ సాను, రచయిత

మంచిదే కానీ...
దేశంలో సేంద్రీయ వ్యవసాయ పెరుగుదల పట్ల లోక్‌సభలో ఈరోజు బీజేపీ ఎంపీలు తమను తాము అభినందించుకునే ధోరణిలో మాట్లాడారు. ఆరోగ్యకరమైన సేంద్రీయ ఉత్పత్తు లకు నేనూ అనుకూలమే. కానీ 2019లో సేంద్రీయ వ్యవసాయం దిశగా మరలి, ఆహార భద్రత పరంగా అది విపత్తు అని నిరూపితమైన శ్రీలంక అనుభవాన్ని మనం దృష్టిలో ఉంచుకోనక్కర్లేదా?
– శశి థరూర్, కాంగ్రెస్‌ ఎంపీ

అరుదైన గౌరవం దిశగా...
ఏకశిలపై తొలచిన లేపాక్షి నందికి అరుదైన వార సత్వ సంపదగా గుర్తింపు పొందే అవకాశం కలిగింది. యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చోటు దక్కించు కున్న లేపాక్షి అరుదైన గుర్తింపునకు చేరువ కావడం సంతోషంగా ఉంది. యునెస్కో తుది జాబితాలోనూ ఈ శిల్పాలయానికి చోటు దక్కాలని ఆకాంక్షిస్తున్నా.      – వి. విజయసాయి రెడ్డి, రాజ్యసభ ఎంపీ

గమనించారా?
కొన్ని ముస్లిం దేశాల్లో నివసిస్తున్న హిందువుల సంఖ్య: ఇండోనేషియా – 44,80,000. మలేషియా – 20,40,000. యూఏఈ – 9,10,000. ఒమన్‌–6.50,000. కువైట్‌– 6,30,000. సౌదీ– 3,70,000. ఖతార్‌– 3,60,000. బహ్రయిన్‌– 2,40,000. ఈ దేశాలు ఎప్పుడు కూడా మసీదుల దగ్గర వ్యాపారాలు చేసుకోవద్దని హిందువులను నిరోధించలేదు.
– హెంద్‌ ఫైజల్‌ అల్‌–ఖసీమీ, యూఏఈ వ్యాపారవేత్త

మరిన్ని వార్తలు