వీర శునకం... ఉగ్రదాడిలో రెండు బుల్లెట్లు దిగినా లెక్కచేయక....

11 Oct, 2022 10:10 IST|Sakshi

శ్రీనగర్‌: జమ్మూ కాశ్మీర్‌ జిల్లాలోని టాంగ్‌పావా ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందుకున్న భద్రతా దళాలు సెర్చ్‌ చేసే ఆపరేషన్‌ని ప్రారంభించాయి. ఈ మేరకు జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో సోమవారం ఉగ్రవాదులు, భధ్రతా బలగాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌ దాడిలో ఆర్మీ కుక్క తీవ్రంగా గాయపడింది. తొలుత ఉగ్రవాదులు ఉంటున్న ఇంటికి 'జూమ్‌' అనే ఆర్మీ కుక్కను పంపినట్లు అధికారులు తెలిపారు.

ఉగ్రవాదులు దాగి ఉన్న ఇంటిపై దాడి చేసి, చేజ్‌ చేసే పనిలో భాగంగా జూమ్‌ ఉగ్రవాదులను గుర్తించి దాడి చేసింది. ఆ సమయంలోనే కుక్క శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకుపోయాయి. అయినప్పటికీ లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడింది. దీని ఫలితంగా ఇద్దరు ఉగ్రవాదులు లొంగిపోయారు. ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాదులు మరణించగా, పలువురు జవాన్లు గాయపడ్డారు.

 ఆ తర్వాత అధికారులు జూమ్‌ని హుటాహుటిన ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కుక్క ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ జూమ్‌ అనే కుక్క అత్యంత శిక్షణ పొందిన క్రూరమైన, నిబద్ధత కలిగిన కుక్క అని చెప్పారు. అంతేగాదు ఉగ్రవాదులను గుర్తించి దాడి చేసి పట్టుకోవడంలో అత్యంత తర్ఫీదు పొందిందని కూడా తెలిపారు. 

(చదవండి: సింహం పిల్లలే కదా అనుకుంటే ఇట్లుంటది.. ఒక్క గాండ్రింపుతో హడల్‌)

మరిన్ని వార్తలు