షోపియాన్‌ ఎన్‌కౌంటర్‌పై ఆర్మీ సీరియస్‌

19 Sep, 2020 08:56 IST|Sakshi

శ్రీనగర్‌ : కశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లా అంశీపుర గ్రామంలో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఉల్లంఘించి, జూలై 18న ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పౌరులను కాల్చి చంపి, మిలిటెంట్లను చంపినట్లు సైన్యం ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో వార్తలు వెల్లువెత్తడంతో సైన్యం దీనిపై విచారణ చేపట్టింది. లెఫ్టినెంట్‌ జనరల్‌ డీఎస్‌ రాజు నేతృత్వంలో విచారణ సాగింది. దీంతో సైనికులు చంపింది సాధారణ పౌరులనే అనడానికి ఆధారాలు దొరికాయని సైనిక ప్రతినిధి కల్నల్‌ రాజేష్‌ కాలియా చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశించినట్లు సైన్యం పాటించాల్సిన నియమాలు ఉల్లంఘనకు గురయ్యాయని సైనికాధికారులు తెలిపారు. బాధ్యులైన వారిపై ఆయుధ చట్టం కింద క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సంబంధిత క్రమశిక్షణాధికారి ఆదేశాలిచ్చారు. నిబంధనల ప్రకారం తప్పు చేసిన సైనికాధికారులపై, త్వరలోనే కోర్టు మార్షల్‌ ప్రొసీడింగ్స్‌ ప్రారంభం అవుతాయి. (మోదీకి బర్త్‌డే గిఫ్ట్‌గా ఇవి కావాలట!)

మరిన్ని వార్తలు