విజయవంతంగా గుండె మార్పిడి శస్త్ర చికిత్స: అనారోగ్యంతో ఉన్న సైనికుడి భార్య కోసం మరో ఆర్మీ సైనికుడి...

15 Feb, 2023 14:21 IST|Sakshi

సాక్షి, చెన్నై: పుణెలోని ఆర్మీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియో థొరాసిక్‌ సైన్సెస్‌ అనారోగ్యంతో ఉన్న ఒక సైనికుడి భార్యకు విజయవంతంగా గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేసింది. ఆ మహిళకు బ్రెయిన్‌ డెడ్‌ అయిన 40 ఏళ్ల ఆర్మీ వెటరన్‌ గుండెను అమర్చారు. ఫిబ్రవరి 8న మధ్యప్రదేశ్‌లోని భింద్‌లో జరిగిన ప్రమాదంలో ఆ దిగ్గజ సైనికుడు తీవ్రంగా గాయపడటంతో బ్రెయిన్‌ డెడ్‌ అయ్యింది.

దీంతో అతని గుండెను ఢిల్లీ నుంచి భారత వైమానిక దళానికి చెందిన ‍ప్రత్యేక విమానంలో పుణేలోని అనారోగ్యంతో బాధపడుతున్న మరో సైనికుడి భార్య కోసం తరలించారు. అందుకోసం అధికారులు పూణే ట్రాఫిక్‌ అధికారుల సమన్వయంతో దాదాపు నాలుగంటల్లో తరలించారు. దీంతో ఆమెకు వైద్యులు విజయవంతంగా గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. పూణే ట్రాఫిక్‌ పోలీసుల సాయంతో విమానంలో గుండెను సకాలంలో తరలించడంతో విజయవంతంగా ఆపరేషన్‌ను పూర్తి చేయగలిగాం. ఇప్పటి వరకు ఈ ఆస్పత్రిలో ఇలాంటి శస్త్ర చికిత్సలు రెండు జరిగాయని ఇది మూడో శస్త్ర చికిత్స అని పుణె ఆర్మీ ఆస్పత్రి ట్వీట్టర్‌లో పేర్కొంది. 

(చదవండి: మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌..చివరికి ప్రియురాలిని చంపి పరుపులో కుక్కి..)

మరిన్ని వార్తలు