అర్నబ్‌ గోస్వామికి సుప్రీంకోర్టులో ఊరట

6 Nov, 2020 16:49 IST|Sakshi

ఢిల్లీ : రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్నబ్‌ గోస్వామికి శుక్రవారం సుప్రీంకోర్టులో ఊరట లభించిం‍ది. అక్టోబర్ 13న మహారాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి అర్నబ్‌కు లేఖ రాసి బెదిరింపులకు పాల్పడ్డారని గోస్వామి తరపు న్యాయవాది హరీష్ సాల్వే సుప్రీంలో ఆరోపించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శి రాసిన లేఖను సుప్రీం కోర్టులో సమర్పించారు. కాగా అర్నబ్ గోస్వామికి లేఖ రాయడం తప్పుబట్టిన సుప్రీం మహారాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శికి ధిక్కార నోటీసులు జారీ చేసింది. రెండు వారాల తరువాత జరగనున్న విచారణ సందర్భంగా  మహారాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శిని హాజరుకావాలని ఉన్నత న్యాయస్థానం కోరింది. అప్పటి వరకు అర్నబ్‌ గోస్వామిని అరెస్ట్‌ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. (చదవండి : అర్నబ్‌కు దొరకని బెయిల్)‌

ఈ విషయంలో సహకరించడానికి  సీనియర్ న్యాయవాది అరవింద్ దాతర్‌ను అమికస్‌గా నిమమించినట్లు భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఐ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అర్నబ్‌ గోస్వామి తనను అక్రమంగా అరెస్ట్‌ చేశారన్న కారణంతో కోర్టును సంప్రదించనందుకే లేఖను రాసి బెదిరించడం ద్వారా న్యాయ పరిపాలనలో తీవ్రంగా జోక్యం చేసుకుందని సుప్రీంకోర్టు ఆరోపించింది.  

'అసెంబ్లీ కార్యదర్శి రాసిన లేఖలో ఉద్దేశం ప్రకారమే పిటిషనర్‌ను బెదిరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 32  ప్రకారం కోర్టును ఎవరైనా సంప్రదిచ్చవచ్చు. అర్నబ్‌ విషయంలో మహారాష్ట్ర అసెంబ్లీ దీనిని ఇది ఒక ప్రాథమిక హక్కుగా భావించాలని' సుప్రీంకోర్టు తెలిపింది. (చదవండి : అర్నాబ్ న్యాయ పోరాటం)

కాగా ఈ లేఖ విషయంలో సహకరించాలని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్‌కు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా ఇంటీరియర్‌ డిజైనర్‌ అన్వయ్‌ నాయక్, ఆయన తల్లి కుముదిని ఆత్మహత్యకు అర్నబ్‌ కారణమంటూ వచ్చిన 2018 నాటి ఆరోపణలపై బుధవారం ముంబై పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అర్నబ్‌ను అలీబాగ్‌ నగర్‌ పరిషత్‌ స్కూల్‌లో కోవిడ్‌ సెంటర్‌లో జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉంచారు.  

మరిన్ని వార్తలు