కాటేసిన పేదరికం 

10 Oct, 2020 08:29 IST|Sakshi

టీ.నగర్‌(తమిళనాడు): పేదరికం కారణంగా ఐదేళ్ల బిడ్డకు పాలలో విషమిచ్చి కడతేర్చి తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. విల్లుపురం పాపానకుళం ప్రాంతానికి చెందిన అన్వర్‌బాషా కుమారుడు సాధిక్‌బాషా (35) ప్రైవేటు బస్‌ కండక్టర్‌. ఇతని భార్య యాస్మిన్‌ (28). వీరికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా సాధిక్‌బాషా పనిలేక ఇంట్లో ఉండడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. గతనెల 28న ఐదు నెలల చిన్నారికి యాస్మిన్‌ పాలుపట్టి పడుకోబెట్టింది. మరుసటి రోజున బిడ్డ మృతిచెందింది. సాధిక్‌బాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు విల్లుపురం వెస్ట్‌ పోలీసులు విచారణ జరిపారు. పోస్టుమార్టం నివేదిక గురువారం వచ్చింది. అందులో బిడ్డకు పాలలో విషమిచ్చి చంపినట్లు తెలిసింది. దీంతో తల్లి యాస్మిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. (చదవండి: సోషల్‌ మీడియాలో పరిచయం.. ఆపై)

భార్యను కడతేర్చి భర్త ఆత్మహత్య:
సెమ్మంజేరి సునామీ క్వార్టర్స్‌కు చెందిన నారాయణన్‌ (70). ఇతని భార్య మనోన్మణి (48). భార్యపై నారాయణన్‌కు అనుమానం రావడంతో దంపతులు మధ్య తరచూ గొడవలు జరిగేవి. శుక్రవారం కూడా గొడవ జరగడంతో ఆగ్రహించిన నారాయణన్‌ మనోన్మణిపై బండరాయితో దాడి చేసి హతమార్చాడు. తర్వాత ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సెమ్మంజేరి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (దారుణం: జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ..)

మరిన్ని వార్తలు