"అలా జ‌రిగితే ఒక్క‌రిని కూడా చావ‌నివ్వం"

6 May, 2021 17:12 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ‌రాజ‌ధానిలో ఆక్సిజ‌న్ కొర‌తపై సుప్రీంకోర్టు కేంద్రంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఢిల్లీకి ప్ర‌తిరోజు 700 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేయాల‌ని కోర్టు ఆదేశించింది. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కోర్టు ఆదేశాల మేర‌కు కేంద్రం ఢిల్లీకి స‌రిప‌డా ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేస్తే.. ప్రాణ‌వాయువు కొర‌త‌తో ఒక్క‌రిని కూడా చ‌నిపో‌నివ్వ‌ను అన్నారు. ఆక్సిజ‌న్ కొర‌త‌తో ఢిల్లీలో ఇప్ప‌టికే ప‌లువురు ప్రాణాలు విడిచిన సంగ‌తి తెలిసిందే. 

ఈ నేప‌థ్యంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. "మాకు రావాల్సిన మేర‌కు ప్ర‌తిరోజు 700 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్‌ను కేటాయిస్తే.. ఢిల్లీలో ప్రాణ‌వాయువు కొర‌త‌తో ఒక్క మ‌ర‌ణం కూడా సంభ‌వించ‌దు. స‌రిప‌డా ఆక్సిజ‌న్ ల‌భిస్తే మేం ఢిల్లీలో 9,000-9,500 ప‌డ‌క‌లు ఏర్పాటు చేస్తాం. ఆక్సిజన్ బెడ్స్ కూడా ఏర్పాటు చేస్తాం. మేం మీకు హామీ ఇస్తాం.. మాకు స‌రిప‌డా ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేస్తే.. ప్రాణ‌వాయువు కొర‌త‌తో ఢిల్లీలో ఒక్క‌రు కూడా మ‌ర‌ణించారు" అన్నారు.

అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన ఆరోగ్య సంక్షోభంలో ఢిల్లీ ఆసుపత్రులు, రోగులకు స‌రిప‌డా ఆక్సిజ‌న్ అందించ‌లేక‌పోయినందుకు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కేంద్రం పొరుగున ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, హర్యానాకు ప్రాధాన్యత ఇవ్వగా.. ఢిల్లీకి అధికారికంగా కేటాయించిన ఆక్సిజన్ మొత్తంలో కేంద్రం సగం పరిమాణాన్ని మాత్ర‌మే స‌ర‌ఫ‌రా చేస్తుంద‌ని ఆరోపించింది.

గత 24 గంటల్లో దేశ‌వ్యాప్తంగా  4,12,262 కొత్త కోవిడ్‌ కేసులను నమోదు కాగా 3,980 మరణాలను వెలుగు చూశాయి. దేశంలో మొత్తం క‌రోనా కేసులు 2.1 కోట్ల దాటిపోయాయని.. మరణాలు 2,30,168 గా ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

చ‌ద‌వండి: అధికారులను జైలులో పెడితే ఆక్సిజన్‌ రాదు: సుప్రీంకోర్టు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు