మీడియాను భయపెడుతున్నారు: కేజ్రీవాల్‌

23 Jul, 2021 05:13 IST|Sakshi

దైనిక్‌ భాస్కర్, భారత్‌ సంచార్‌లపై ఐటీ దాడులు మీడియాని భయపెట్టడమేనని ఢిల్లీ సీఎం కేజ్రివాల్‌ విమర్శించారు. ఇలాంటి చర్యలు వెంటనే నిలిపివేయాలని, మీడియా స్వేచ్ఛగా పని చేసుకునే వాతావరణాన్ని కల్పించాలని ట్వీట్‌ చేశారు. ‘బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారు సహించలేరు. ఇలా దాడులకు దిగుతారు. ప్రతీ ఒక్కరూ కేంద్రం చర్యల్ని తీవ్రంగా వ్యతిరేకించాలి’ అని కేజ్రివాల్‌ ట్వీట్‌చేశారు. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ దాడుల్ని అత్యంత క్రూరమైన చర్యగా అభివర్ణించారు. ఈ దాడులు మీడియా గళాన్ని అణగదొక్కడానికేనని  రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ పేర్కొన్నారు. సీపీఐ(ఎం) కేంద్ర సంస్థల్ని బెదిరించడానికి వాడుకుంటోందని ధ్వజమెత్తింది. గంగానదిలో కరోనా రోగుల శవాలు తేలినట్టుగా కేంద్రం చేసిన తప్పిదాలు వెలుగులోకి రాకమానవని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.

మరిన్ని వార్తలు