ఆ విషయమై రాహుల్‌ గాంధీని కలవనున్న అరవింద్‌ కేజ్రీవాల్‌

26 May, 2023 13:25 IST|Sakshi

ఢిల్లీ బ్యూరోక్రాట్ల నియంత్రణ అంశమై కేంద్రంపై జరుగుతున్న పోరు విషయమై మద్దతును అభ్యర్థించేందుకు కాం‍గ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేలను కలిసిందుకు అవకాశం ఇవ్వాలని ఢ్లిల్ల సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అభ్యర్థించారు. ఈ మేరకు ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత(ఆప్‌) చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ అంశంపై కేంద్ర ప్రవేశ పెట్టిన బిల్లు వీడిపోయేలా తగినంత మద్దతు పొందడం కోసం వివిధ నాయకులతో ఇప్పటికే సమావేశమయ్యారు.

ఇటీవల సుప్రీం కోర్టు బ్యూరోక్రాట్‌ బదిలీల నియామకాలపై కేంద్రం కాదు, ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వమే నియంత్రణ కలిగి ఉంటుందని ఆదేశాలిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఐతే ఈ తీర్పును పూర్వపక్షం చేసేలా ఆర్డినెన్స్‌ని కేంద్ర ‍ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ శీతకాల సమావేశంలో ఆమెదించిన ఆర్డినెన్స్‌ స్థానంలో బిల్లును తీసుకురావాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ రాహుల్‌ గాంధీని, మల్లిఖార్జున్‌ ఖర్గేని కలిసి, సమావేశమయ్యేందుకు సమయం కావాలని కోరినట్లు ట్వీట్‌ చేశారు.

ఆ సమావేశంలో.. బీజేపీ ప్రభుత్వం ఆమోదించిన అప్రజాస్వామిక రాజ్యంగ విరుద్ధమైన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా పార్లమెంటులో కాంగ్రెస్‌ మద్దతు కోరడానికి, అలాగే సమాఖ్య నిర్మాణంపై సాధారణ దాడి, ప్రస్తుతం రాజకీయ పరిస్థితులె తదితరాలపై చర్చించనున్నట్లు తెలిపారు అరవింద్‌ కేజ్రీవాల్‌. కాగా, ఈ అంశంపై ఆప్‌కి మద్దతు ఇవ్వాలా వద్దా అనే అంశంపై తమ ప్రాంతీయ నేతలతో సంప్రదింపులు జరుపుతామని కాంగ్రెస్‌ తెలిపింది.   

(చదవండి: తీవ్ర అనారోగ్యం.. ఆప్‌ సత్యేందర్‌ జైన్‌కు మధ్యంతర బెయిల్‌)

మరిన్ని వార్తలు