‘ఆర్య సమాజ్‌లు ఇచ్చే మ్యారేజ్‌ సర్టిఫికెట్లు చెల్లవ్‌’.. అలహాబాద్‌ హైకోర్టు కీలక ఆదేశాలు

6 Sep, 2022 21:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో: ఆర్య సమాజ్‌ ఇచ్చే మ్యారేజ్‌ సర్టిఫికెట్ల విషయంలో న్యాయ స్థానం తీవ్రంగా స్పందించింది. పత్రాల వాస్తవికతను పరిగణనలోకి తీసుకోకుండా వివాహాలను నిర్వహించడంలో నమ్మకాలను దుర్వినియోగం చేస్తున్నారంటూ అలహాబాద్‌ హైకోర్టు మండిపడింది.
 
ఈ క్రమంలో.. ఆర్య సమాజ్ సొసైటీ ఇచ్చే వివాహ ధ్రువపత్రాలకు ఎలాంటి చట్టబద్ధత లేదని అలహాబాద్‌ హైకోర్టు తేల్చింది. ఆర్యసమాజ్‌లో ప్రధాన్‌లు ఇచ్చే సర్టిఫికెట్‌కు చట్టబద్ధత లేదు. వివాహాలను తప్పకుండా నమోదు చేసుకోవాల్సిందేనని స్సష్టం చేసింది. ఈ మేరకు ఏకసభ్య ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నా దాన్ని రిజిస్టర్‌ చేయకపోతే న్యాయస్థానాల పరిధిలో అధికారికంగా గుర్తించలేమని పేర్కొన్నారు. కేవలం ఆ సంస్థ ఇచ్చే పత్రాలు వివాహ చట్టబద్ధతను నిరూపించలేవని అన్నారు. 

ఒక తండ్రి తన కూతురి విషయంలో అలహాబాద్‌ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్‌ దాఖలు చేశాడు. దానిపై విచారణ సమయంలో.. న్యాయమూర్తి జస్టిస్‌ సౌరభ్‌ శ్యాం సమాశ్రయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ఆర్యసమాజ్ సొసైటీలు జారీ చేసిన వివాహ ధ్రువీకరణ పత్రాలతో కోర్టు నిండిపోయింది. ఈ కోర్టు, ఇతర హైకోర్టులలో వివిధ విచారణల సమయంలో వాటి చట్టబద్ధతను తీవ్రంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పత్రాల వాస్తవికతను కూడా పరిగణనలోకి తీసుకోకుండా వివాహాలను నిర్వహించడంలో ఆర్య సమాజ్ సంస్థ నమ్మకాలను దుర్వినియోగం చేసింది. ఈ కేసులో.. వివాహం రిజిస్టర్ కానందున పైన పేర్కొన్న సర్టిఫికేట్ ఆధారంగా మాత్రమే పార్టీలు వివాహం చేసుకున్నట్లు భావించలేము’ అని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: దొంగతనానికి వచ్చి కక్కుర్తితో అడ్డంగా బుక్కయ్యారు

మరిన్ని వార్తలు