ఆర్యభట్ట మ్యాథ్స్‌ కాంపిటీషన్‌; మొదటి విజేతకు లక్షన్నర

11 May, 2021 14:49 IST|Sakshi

ఎంపికైతే టాప్‌–3 విజేతలకు బహుమతులు

దరఖాస్తులకు చివరి తేది: 20.05.2021

ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ స్కిల్‌ డవలప్‌మెంట్‌(ఏఐసీటీఎస్‌డీ), ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థులతో కలిసి ఆర్యభట్ట నేషనల్‌ మ్యాథ్స్‌ కాంపిటీషన్‌ను ప్రతి ఏటా నిర్వహిస్తోంది. మ్యాథమెటిక్స్‌లో ప్రతిభావంతులను గుర్తించి.. భవిష్యత్‌ టెక్నాలజీ సైంటిస్ట్‌లుగా ఎదిగేలా ప్రోత్సహించేందుకు ఈ పరీక్ష జరుపుతోంది. ఈ ఏడాదికి సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఆర్యభట్ట నేషనల్‌ మ్యాథ్స్‌ కాంపిటీషన్‌కు అర్హతలు, ప్రయోజనాలు, పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం.. 

అర్హతలు
దేశంలోని ఏదైనా కళాశాల, లేదా పాఠశాల విద్యార్థులు ఆర్యభట్ట నేషనల్‌ మ్యాథ్స్‌ కాంపిటీషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 10ఏళ్ల నుంచి 24ఏళ్లలోపు ఉండాలి. జాతీయ స్థాయి పోటీలో తమ మ్యాథమెటిక్స్‌ నైపుణ్యాలను ప్రదర్శించాలనే అభిలాష ఉండాలి. 

ప్రయోజనాలు
పరీక్షలో ప్రతిభ చూపిన టాప్‌ 20 మందిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో టాప్‌ –3ని విజేతలుగా ప్రకటిస్తారు. మొదటి విజేతకు రూ.1.5 లక్షలు, రెండో విజేతకు రూ.50 వేలు, మూడో విజేతకు రూ.పదివేలు అందిస్తారు. దీంతోపాటు ఏఐసీటీఎస్‌డీ ధ్రువపత్రం, నేషనల్‌ మ్యాథమెటిక్స్‌ సైంటిస్ట్‌ ట్రోఫీ ఇస్తారు. అదేవిధంగా రోబోటిక్స్‌ ఆటోమేషన్, సాఫ్ట్‌వేర్స్‌ విత్‌ ఇండస్ట్రియల్‌ ప్రొఫెషనల్స్‌లో ఉచిత శిక్షణ లభిస్తుంది. అంతేకాకుండా ఏఐసీటీఎస్‌డీ నిర్వహించే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కూడా పొందొచ్చు. స్కాలర్‌షిప్‌కు కూడా అవకాశం ఉంది. 


పరీక్ష విధానం!
పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. ఇంటి నుంచే రాయొచ్చు. ప్రశ్న పత్రం ఆబ్జెక్టివ్‌ విధానం(ఎంసీక్యూ)లో ఉంటుంది. 30 ప్రశ్నలకు– 60 మార్కులు కేటాయించారు. పరీక్ష సమయం 45 నిమిషాలు. నెగిటివ్‌ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత వేస్తారు. ల్యాప్‌ట్యాప్‌ లేదా పీసీ ద్వారా పరీక్షకు హాజరుకావచ్చు. రాత పరీక్షలో ప్రతిభ చూపిన టాప్‌ 20 మందికి ఆన్‌లైన్‌ లైవ్‌ ఇంటర్వ్యూ ఇంటి నుంచే హాజరుకావచ్చు. 

► పది నుంచి పదమూడేళ్ల వయసు విద్యార్థులకు గ్రూప్‌–1 విభాగం పరీక్ష; 14ఏళ్ల నుంచి 17 ఏళ్ల వయసు విద్యార్థులకు గ్రూప్‌–2 విభాగం పరీక్ష; 18ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయసు విద్యార్థులకు గ్రూప్‌–3 విభాగం పరీక్ష ఉంటుంది. ఆయా విభాగం పరీక్షలకు సిలబస్‌ భిన్నంగా ఉంటుంది. 

► గ్రూప్‌–1 విభాగం విద్యార్థులకు చైన్‌ రూల్, పర్సంటేజెస్, స్పీడ్‌ అండ్‌ డిస్టెన్స్, యావరేజెస్, నంబర్‌ సిస్టమ్, టైమ్‌ అండ్‌ వర్క్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, టైమ్‌ అండ్‌ క్యాలెండర్‌ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.

► గ్రూప్‌–2 విభాగం విద్యార్థులకు కంపేరింగ్‌ క్వాంటిటీస్, ఏజెస్, ట్రైన్స్, టైమ్‌ అండ్‌ వర్క్, ట్రూ డిస్కౌంట్, చైన్‌ రూల్, హెచ్‌సీఎఫ్‌ అండ్‌ ఎల్‌సీఎం, ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌ అంశాలపై ప్రశ్నలు ఎదురవుతాయి. 

► గ్రూప్‌–3 వి«భాగం విద్యార్థులకు ప్రాఫిట్‌ అండ్‌ లాస్,రేషియో అండ్‌ ప్రపోర్షన్,స్పీడ్‌ అండ్‌ డిస్టెన్స్, సింపుల్‌ ఇంటరెస్ట్, టైమ్‌ అండ్‌ వర్క్, ట్రైన్స్, చైన్‌ రూల్, ఏజెస్‌పై ప్రశ్నలు అడుగుతారు. 

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.290. మొదట దరఖాస్తు చేసిన పదివేల మందిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. 

► దరఖాస్తులకు చివరి తేది: 20.05.2021 
► ఆన్‌లైన్‌ పరీక్ష తేది: 10.06.2021
► తుది ఫలితాల వెల్లడి: 30.06.2021
► వెబ్‌సైట్‌: https://www.aictsd.com/aryabhatta-national-maths-competition

After 10th Class: టెన్త్‌.. టర్నింగ్‌ పాయింట్‌!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు