ఆరెస్సెస్‌కు సపోర్టుగా దీదీ వ్యాఖ్యలు.. ఒవైసీ సీరియస్‌ కామెంట్స్‌

1 Sep, 2022 18:45 IST|Sakshi

బెంగాల్‌ రాజకీయాలు అనగానే బీజేపీ వర్సెస్‌ సీఎం మమతా బెనర్జీ అన్నట్టుగా ఉంటాయి. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి రెండు పార్టీల మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. అయితే, ఈ క్రమంలో సీఎం మమత.. ఆరెస్సెస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.  దీంతో, ఆమె వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ మమతకు పరోక్షంగా కౌంటర్‌ ఇచ్చారు.

అయితే, సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఇటీవ‌ల ఆరెస్సెస్‌పై మాట్లాడుతూ గ‌తంలో ఉన్నంత చెడ్డ‌గా లేద‌ని అన్నారు. కాగా, ఆమె వ్యాఖ్యలపై తాజాగా ఎంఐఎం చీఫ్‌ అసద్దుద్దీన్‌ ట్విట్టర్‌ వేదికగా కౌంటర్‌ ఇచ్చారు. అసద్‌ స్పందిస్తూ.. ఆరెస్సెస్‌ హిందూ రాజ్యాన్ని కాంక్షిస్తుందన్నారు. ఆరెస్సెస్‌ చ‌రిత్రంతా ముస్లిం వ్య‌తిరేక‌తే క‌నిపిస్తుంద‌న్నారు. ఆరెస్సెస్‌పై వ్యాఖ్యలపై మ‌మ‌తా బెన‌ర్జీ నిజాయితీని, నిల‌క‌డ ధోర‌ణిని టీఎంసీ ముస్లిం నేత‌లు ప్ర‌శంసిస్తార‌ని పరోక్షంగా కౌంటర్‌ ఇచ్చారు. ఈ క్రమంలోనే మమత 2003లో ఆరెస్సెస్‌పై చేసిన వ్యాఖ్యలను సైతం గుర్తు చేశారు. 

2003లో ఆరెస్సెస్‌ను దేశ‌భ‌క్తులుగా కీర్తించార‌ని, ఆరెస్సెస్‌లో ఇప్ప‌టికీ చాలా మంది మంచివారున్నార‌ని, వారు బీజేపీకి మ‌ద్ద‌తివ్వ‌బోర‌ని మమత చెప్పినట్టు ఒవైసీ తెలిపారు. దీంతో, ఆరెస్సెస్‌ మమతా బెనర్జీని దుర్గగా అభివ‌ర్ణించార‌ని చెప్పుకొచ్చారు. ఇక, మమత వ్యాఖ్యలపై బెంగాల్ ఇమాం అసోసియేష‌న‌న్ చీఫ్ మ‌హ్మ‌ద్ యాహ్య కూడా స్పందిస్తూ 20 కోట్ల మంది ముస్లింలు మ‌మ‌తా బెన‌ర్జీని సెక్యుల‌ర్ నేత‌గా భావిస్తున్నరని తెలిపారు. కానీ, అనూహ్యంగా ఆమె ఇలా మాట్లాడటం కరెక్ట్‌ కాదని స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: బీజేపీ హై కమాండ్‌కు రాజాసింగ్‌ భార్య లేఖ.. ఏమన్నారంటే?

మరిన్ని వార్తలు