యూపీ సీఎం యోగిపై అసదుద్దీన్‌ ఒవైసీ షాకింగ్‌ కామెంట్స్‌

13 Jun, 2022 16:04 IST|Sakshi

దేశంలో బుల్డోజర్ల వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది. మొన్నటి వరక ఢిల్లీలో బుల్డోజర్లకు పనిచెప్పగా.. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో  బుల్డోజరుతో కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యానాథ్‌పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

అయితే, మాజీ బీజేపీ నేత నుపూర్‌ శర్మ వ్యాఖ్యలకు నిరసనగా జూన్‌ 10వ తేదీన ముస్లిం సంఘాలు దేశవ్యాప్తంగా మసీద్‌ల వద్ద ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూపీతో సహా పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. 

కాగా యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో హింసాత్మక ఘటనలకు ప్రధాన సూత్రధారి అయిన జావేద్ మహ్మద్ ఇంటిని యోగి సర్కార్‌ కూల్చివేసింది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని కచ్‌ నగరంలో ఓ ర్యాలీలో మజ్లిస్ పార్టీ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ.. సీఎం యోగిపై విరుచుకుపడ్డారు. యూపీ సీఎం యోగి అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎవరినైనా దోషులుగా నిర్ధారిస్తారా? వారి ఇళ్లను కూల్చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: గాంధీ ఫ్యామిలీపై ఈగ వాలినా అంతుచూస్తాం

మరిన్ని వార్తలు