భారత్‌.. నాదీ కాదు, మోదీ-షాలదీ కాదు: ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

29 May, 2022 10:22 IST|Sakshi

భారత దేశం గురించి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌.. నాది(ఒవైసీ) కాదు, మోదీ-షాలదీ కాదు.. అంతుకుమించి థాక్రేలది అసలే కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజానికి భారత దేశం ద్రవిడియన్లు, ఆదివాసీలది అని కామెంట్స్‌ చేశారు. 

వివరాల ప‍్రకారం.. ఒవైసీ శనివారం మహారాష్ట్రలోని బీవండిలో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బీజేపీ, నేషనలిస్ట్‌ కాం​గ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ)పై విరుచుకుపడ్డారు. భారత్‌..  ద్రవిడియన్లు, ఆదివాసీలది మాత్రమేనని అభిప్రాయపడ్డారు. నాదీ కాదు, మోదీ-షాలదీ, థాక్రేలది అసలే కాదని అన్నారు. ఆఫ్రికా, మధ్య ఆసియా, ఇరాన్, తూర్పు ఆసియా నుంచి వలస వచ్చిన వారితోనే భారత్ ఏర్పడిందని వ్యాఖ్యానించారు. 

దేశంలోకి మొగల్స్‌ వచ్చి వెళ్లిన తర్వాతే ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. ఈ క్రమంలోనే ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌పై మండిపడ్డారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు చేసినట్లుగా నవాబ్ మాలిక్ అరెస్ట్‌పై ప్రధాని మోదీని ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. బీజేపీ, ఎన్సీపీ, కాంగ్రెస్, ఎస్పీ పార్టీలు లౌకిక పార్టీలు అని వ్యాఖ‍్యలు చేశారు.

అయితే, సంజయ్ రౌత్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థలు(సీబీఐ, ఈడీ) ఎలాంటి చర్య తీసుకోకుండా శరద్ పవార్, ప్రధాని మోదీని కలిశారని తెలిపారు. ఇదే సమయంలో ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అరెస్ట్ అయితే ఆయనకు ఎందుకు సాయం చేయలేదని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో నవాబ్‌ మాలిక్‌.. ముస్లిం కావడం వల్లేనా..? అని ప్రశ్నించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 

ఇది కూడా చదవండి:  యూపీ సీఎం యోగి సంచలన నిర్ణయం

మరిన్ని వార్తలు