‘ఓ బామ్మలు.. మీ డ్యాన్స్‌ ముందు హీరోయిన్లంతా దిగదుడుపే’

12 May, 2021 10:04 IST|Sakshi

ఏజ్‌ జస్ట్‌ నెంబర్‌ మాత్రమే

ప్రపంచాన‍్ని మరిచి పోయి డ్యాన్స్‌ వేస్తున్న బామ్మలు

బామ్మల స్టెప్పులకు నెటిజన్ల ఫిదా 

ఏజ్‌ జస్ట్‌ నెంబర్‌ మాత్రమే.కొంతమందికి వయస్సు మీద పడుతున్న వాళ్లు అనుకున్న లక్ష్యాల్ని, కోల్పోయిన సంతోషాల్ని వయస్సుతో సంబంధం లేకుండా తిరిగి పొందాలని కోరుకుంటుంటారు. సంతోషం కోసం ఏమైనా చేయాలనుకొని ఒక్కసారి మనసులో గట్టిగా అనుకుంటే చాలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయి వాళ్లు ఏం చేయాలని అనుకుంటారో అదే చేస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా?  తాజాగా ఇద్దరు బామ్మలు వేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఇండియన్‌ ప్లే బ్యాక్‌ సింగర్‌ ఆశా భోస్లే సూపర్‌ హిట్‌ సాంగ్‌ 'పియా తు అబ్ తో ఆజా' పాటకు ఓ ఇద్దరు బామ్మలు వేసిన స్టెప్స్‌ నెటిజన‍్లను ఆకట్టుకుంటున్నాయి. ఓ ప్రాంతంలో అటుగా వెళ‍్తున్న ఆ బామ్మలకు పియా తు అబ్‌ తో అజా పాట వినపడింది. అంతే వయస్సుతో సంబంధం లేకుండా ప్రపంచాన్ని మరిచిపోయి ఆ పాటను అనుకరిస్తూ డ్యాన్స్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో షికార్లు చేస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు..‘ఓ బామ్మలు.. మీ డ్యాన్స్‌ ముందు హీరోయిన్లంతా దిగదుడుపే అని కామెంట్లు చేస్తుంటే మరికొందరు.. వీళ్లిద్దరిని చూస్తుంటే డబ్బు మాత్రమే సంతోషాన్ని ఇవ్వదు’ అని కామెంట్‌ చేస్తున్నారు.

     

మరిన్ని వార్తలు