కుతుబ్‌ మినార్‌లో ఆలయ పునరుద్ధరణ సాధ్యం కాదు.. తేల్చి చెప్పిన భారత పురావస్తు సర్వే

24 May, 2022 12:30 IST|Sakshi

న్యూఢిల్లీ: రక్షిత స్మారక ప్రదేశం అయితే కుతుబ్‌ మినార్‌ కాంప్లెక్స్‌లో..  ఆలయాన్ని పునరుద్ధరించడం సాధ్యం కాదని ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా తేల్చి చెప్పేసింది. 

భారత పురావస్తు సర్వే శాఖ  కీలక ప్రకటన చేసింది. కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో ఆలయపునరుద్ధరణ వ్యవహారం సాకేత్ కోర్టుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో.. ఆ స్థలంలో ఆలయాన్ని పునరుద్ధరించాలనే అభ్యర్థనను ఏఎస్‌ఐ తోసిపుచ్చింది.

కుతుబ్‌ మినార్‌ అనేది 1914 నుంచి పరిరక్షణ స్మారకంగా కొనసాగుతోంది. అలాంటి చోటులో నిర్మాణాలను మార్చడం సాధ్యం కాదు. స్మారక చిహ్నం వద్ద ఆరాధన పునరుద్ధరణ అనుమతించబడదు అని ఏఎస్‌ఐ స్పష్టం చేసింది.

పూజలకే కాదు.. నమాజ్‌కు నో
ఆర్కియాలజీ నిబంధనల ప్రకారం.. నివాసం లేని ప్రదేశాల్లో ప్రార్థనలకు అనుమతించరు. ఈ లెక్కన.. కుతుబ్‌మినార్‌ దగ్గర పూజలకే కాదు.. నమాజ్‌కు అనుమతులు ఇవ్వలేదు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అవుతుండగా.. తాము తాజాగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా స్పష్టం చేసింది. పాలసీ ప్రకారం..  నమాజ్‌ను నిలిపివేయాలని గతంలోనే కోరామని, పంపిన ఆదేశాలు కూడా ఎప్పటివో అని స్పష్టం చేసింది. 

జ్ఞానవాపి మసీద్‌ సర్వే వ్యవహారం వార్తల్లో నిలిచి వేళ.. ఏఎస్‌ఐ మాజీ రీజినల్‌ డైరెక్టర్‌ ధరమ్‌వీర్‌ శర్మ కుతుబ్‌మినార్‌ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుతుబ్‌ మినార్‌ను కుతుబ్‌ అల్‌ దిన్‌ ఐబక్‌ కట్టించలేదని, సూర్యుడి దశను అధ్యయనం చేసేందుకు రాజా విక్రమాదిత్య కట్టించాడని వాదిస్తున్నాడు. 

మరోవైపు హిందూ సంఘాలు కుతుబ్‌ మినార్‌ వద్దకు చేరుకుని విష్ణు స్తంభ్‌గా పేరు మార్చాలంటూ డిమాండ్‌ చేస్తున్నాయి.

చదవండి: కుతుబ్‌ మినార్‌ తవ్వకాలపై కేంద్రం క్లారిటీ

మరిన్ని వార్తలు