Taj Mahal 22 Rooms Case: మూతపడ్డ 22 గదుల ఫోటోలు విడుదల

17 May, 2022 15:27 IST|Sakshi

లక్నో: భారత పురావస్తు శాఖ తాజ్‌మహల్‌లో మూతపడ్డ 22 గదులకు సంబంధించి కొన్ని ఫోటోలను విడుదల చేసింది. ఈ మేరకు తాజ్‌మహల్‌ని పరిరక్షిస్తున్న ఆర్కియాలజీ సర్వే ఆప్‌ ఇండియా (ఏఎస్‌ఐ) మూతపడ్డ గదులకు సంబంధించిన మరమత్తుల ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. అంతేగాదు ఇటీవలే తాజ్‌మహల్‌లో మూతపడ్డ 22 గదులు తెరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్‌ హైకోర్టు లక్నో బెంచ్‌ తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పిటిషన్‌ పెద్ద హాట్‌ టాపిక్‌గా వార్తల్లో నిలిచింది.

అయితే అలహాద్ హైకోర్టు ఈ పిటిషన్‌ను విచారించడానికి ముందే న్యూస్‌ లెటర్‌ జనవరి 2022 పేరుతో ఆర్కియాలజీ సర్కే ఆప్‌ ఇండియా(ఏఎస్‌ఐ) తాజ్‌మహల్‌లో మరమత్తుల పనులు చేపట్టినట్లు పేర్కొనడం గమనార్హం. అంతేగాదు మే9 వ తేదీన తాజ్‌మహల్‌లో అండర్‌ గ్రౌండ్‌ వర్క్స్‌ అనే పేరుతో మూతపడ్డ 22 గదుల చిత్రాలను వారి అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేయగా, వీటిని తాజాగా ఏఎస్‌ఐ విడుదల చేసింది. 

అంతేగాదు తాజ్‌మహల్‌ పునరుద్ధరణకు ముందు తర్వాత ఫోటోలను గురించి వివరించింది. గోడలు మెట్లు, పాడైన సున్నపు ప్లాస్టర్‌ రీప్లాస్టర్‌గా స్క్రాప్‌ చేయడం వంటి పనులు చేపట్టినట్లు ఏఎస్‌ఐ వెల్లడించింది. అలాగే తాజ్‌మహల్‌ బయటి వైపున, యమునానది ఒడ్డున కూడా మరమత్తుల పనులు చేపట్టినట్లు పేర్కొంది. ఈ మేరకు ఆయా మరమత్తులకు సంబంధించిన ఫోటోలతోపాటు "స్మారక కట్టడం పునరుద్ధరణ పనులు" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది.

(చదవండి:  ‘తాజ్‌ మహల్‌ కాదు.. తేజో మహాలయా పిటిషన్‌’.. కోర్టు ఏమందంటే..)

మరిన్ని వార్తలు