ట్రక్కును ఢీకొట్టిన ఖడ్గమృగం.. వీడియో షేర్‌ చేసిన సీఎం

11 Oct, 2022 13:53 IST|Sakshi

డిస్పూర్‌: రోడ్డుపై వేగంగా వెళ్తున్న భారీ ట్రక్కును ఓ ఖడ్గమృగం ఢీకొట్టిన వీడియో ఇటీవల వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. లారీని ఢీకొట్టిన ఆ రైనో పడుతూ లేస్తూ అడవిలోకి వెళ్లింది. ఈ సంఘటన అస్సాంలోని కజిరంగలో హల్దీబారీ రహదారి వద్ద జరిగింది. అయితే, ఇప్పుడు ఆ ఖడ్గమృగం ఎలా ఉంది? గాయాలై ఇబ్బందులు పడుతోందా? అనే విషయంపై ఆందోళనలు నెలకొన్నాయి. లారీని ఢీకొట్టిన ఖడ్గమృగం పరిస్థితిపై వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. 

‘అర్జెంట్‌ అప్డేట్‌.. హల్దీబారీలో ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన మన రైనో ఫ్రెండ్‌ ఆరోగ్యంగానే ఉంది. ఈ ఉదయం డ్రోన్‌ ద్వారా తీసిన వీడియోను షేర్‌ చేస్తున్నా. జంతువుల పట్ల ప్రతి ఒక్కరు ప్రేమగా ఉండాలని కోరుతున్నా. జంతువులు రోడ్డు దాటే కారిడార్ల వద్ద కాస్త నెమ్మెదిగా వెళ్లండి’ అని పేర్కొన్నారు సీఎం హిమంత బిశ్వ శర్మ. అంతకు ముందు జాతీయ రహదారి 37పై జరిగిన ఈ ప్రమాదం వీడియోను షేర్‌ చేస్తూ.. ఇలాంటి ప్రమాదలు నివారించేందుకు కారిడార్లను విస్తరిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: భారీ ట్రక్కుని ఢీ కొట్టిన ఖడ్గమృగం.... డ్రైవర్‌కి ఊహించని షాక్‌

మరిన్ని వార్తలు