Child Marriage: అర్థరాత్రి రెండు గంటలకు దాడులు..భయాందోళనలో చిన్నారి పెళ్లికూతుళ్లు..

5 Feb, 2023 13:03 IST|Sakshi

అస్సాంలో బాల్య వివాహాలను అణిచివేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర కేబినేట్‌ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు ఆ దిశగా దాడులు నిర్వహించారు. ఆఖరికీ అర్థరాత్రి రెండు గంటలకు తలుపు కొట్టడంతో ప్రారంభమైన దాడులు ఆ చిన్నారును తీవ్ర విషాదంలోకి నెట్టేశాయి. ఈ ఘటనలో చిన్నారులను పెళ్లి చేసుకున్న పలువురు వ్యక్తులను అరెస్టు చేశారు. దీంతో ఏం జరుగుతోందో తెలియని ఆ చిన్నారి పెళ్లి కూతుళ్లు భయందోళనలతో కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ నెల రోజుల్లోనే పోలీసులు సుమారు 4 వేలకు పైగా కేసులు నమోదు చేశారు. ఈ దాడుల కారణంగా కొత్తగా మాతృత్వంలో అడుగు పెడుతున్న నిమి అనే బాల వధువు కన్నీళ్లతో చెక్కిళ్లు తడిచిపోయాయి.

అప్పటి వరకు సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తున్న రెజీనా ఖాతున్‌ అనే మరో చిన్నారి నిస్సత్తువుగా చూస్తోంది. అస్సాం రాష్ట్ర వ్యాప్తంగా సాగిన ఈ దాడుల్లో భర్తల అరెస్టుతో బాల వధువులు ఆవేదనతో అక్కడి వాతావరణం అంతా విషాదంగా మారిపోయింది.  ఒక్క శనివారమే పోలీసులు సుమారు రెండు వేల మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఆ వివాహాలు జరిపించిన పూజారులను, ముస్లీం మత పెద్దలు కూడా ఉండటం గమనార్హం. వారిలో కొంతమంది పారిపోయి పెళ్లి చేసుకున్న మైనర్లు కూడా ఉన్నారు. అయితే ఆ బాల వధువలంతా ఇప్పుడూ మా పరిస్థితి ఏంటి మా పిల్లలను ఎవరూ పోషిస్తారు, ఎక్కడ తలదాచుకోవాలంటూ ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు.

అలాగే వారిలో కొంతమంది పెళ్లి సమయానికి మైనర్లు కాదు, ఆధార్‌కార్డులో తప్పుగా నమోదు చేయడం జరిగిందని కొందరూ వాపోతున్నారు. ఆరోగ్య కార్యకర్తల నుంచి సేకరించిన ఆధార్‌ కార్డులకు సంబంధించిన డేటా సాయంతో పోలీసులు దాడులు నిర్వహించారు. దీంతో అనాధలుగా మారిన బాల వధువుల్లో కొందరికి తల్లిదండ్రుల మద్దతు లభించగా మరికొందరు అధికారుల సంరక్షణలో ఉన్నారు. బాల్యవివాహాలకు చెక్‌పెట్టడం కోసం జరిపిన దాడుల కారణంగా కొందరూ చిన్నారులు గర్భవతులుగా మరికొందరూ తమ పిల్లలతో అనాధలుగా రోడ్డున పడాల్సి వచ్చింది.

ప్రస్తుతం వారంతా ప్రభత్వ షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నారు. అంతేగాదు రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖలో జెండర్‌ స్పెషలిస్ట్‌ అయిన పరిమితా డేకా మాట్లాడుతూ..ఆ మహిళల పట్ల మాకు బాధ్యత ఉంది. ఇది సున్నితమైన వ్యవహారం అని, వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి శాంతించేలా చేయాలి. ఆ తర్వాత వారి భవిష్యత్తును సురక్షితంగా ఉంచేలా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

(చదవండి: పెళ్లీడు వచ్చినా పెళ్లి చేయటం లేదన్న కోపంతో అన్నని..)

మరిన్ని వార్తలు