భారీ భూకంపం: వీడియో వైరల్‌ 

28 Apr, 2021 12:08 IST|Sakshi

 భారీ భూకంపంతో వణికిన అసోం

ఒక భవనంపై ఒరిగిపోయిన మరో భవనం వైరల్‌ వీడియో

అటు కరోనా,ఇటు భూకంపం ప్రియాంక గాంధీ సానుభూతి

గువహటి: అసోం, సోనిత్‌పూర్‌లో బుధవారం సంభవించిన భారీ భూకంపం కలకలం రేపింది. 6.4గా తీవ్రతతో ఒక్కసారిగా భూమి కంపించింది. దీనికి సంబధించిన వీడియోలు, ఫోటోలు సోషల్‌మీడియాలో షేర్‌ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి భూంప్రకంపనల తీవ్రతకు అద్దం పడుతోంది. ఒక అపార్ట్‌మెంట్‌ భవనం మరో భవనంపైకి ఒరిగిపోయింది. దీంతో  రెండు అసార్ట్‌మెంట్‌ వాసులతోపాటు సమీప   ప్రాంత  ప్రజలు భయాందోళనకు లోనయ్యారు.  నగౌస్‌ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.  (అసోంలో భారీ భూకంపం: పరుగులు తీసిన జనం)

భూకంపంపై అసోం సీఎం సర్బానంద సోనావాల్‌  ట్వీట్‌ చేశారు. అసోంలో భారీ భూకంపం వచ్చిందని, ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షాతోపాటు, కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ కూడా దీనిపై స్పందించారు. రాష్ట్రానికి కేంద్రానికి అన్ని విధాలా అండగా ఉంటుందని ప్రధాని మోదీ ట్విట్‌ చేశారు. అటు కరోనా సెకండ్‌ వేవ్‌, ఇటు భూకంపంతో అసోం ప్రజలు బాధపడుతున్నారంటూ ప్రియాంక గాంధీ వారికి తన సానుభూతిని ప్రకటించారు.

మరిన్ని వార్తలు