Assam Floods 2022: కన్నీళ్లలో అస్సాం.. మునుపెన్నడూ లేనంతగా డ్యామేజ్‌.. పదేళ్లలో చేసిందంతా నీళ్లపాలు!

27 May, 2022 10:50 IST|Sakshi

దిస్‌పూర్‌: ప్రతీ ఏటా అస్సాం వరదలు రావడం..  నష్టం వాటిల్లడం జరుగుతున్నదే. అయితే మునుపెన్నడూ లేనంతగా ఈసారి భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. దిమా హసావో జిల్లాలో గత ఐదు-పదేళ్ల చేపట్టిన నిర్మాణాలు, రోడ్లు వరదల్లో కోట్టుకోవడంపై స్వయంగా సీఎం హిమంత బిస్వ శర్మ ప్రకటన చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

అస్సాం వరదలతో ఇప్పటిదాకా 30 మంది చనిపోయారు. వానా-వరద నష్టంతో.. కేవలం ఏడు రాష్ట్రాల్లోనే సుమారు ఐదున్నర లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 956 గ్రామాలు పూర్తిగా నీట మునగ్గా, 47, 139, 12 హెక్టార్ల పంట సర్వనాశనం అయ్యిది. 

ఒక్క నాగోవ్‌ జిల్లాలో దాదాపు నాలుగు లక్షల మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాచర్‌లో లక్షన్నర, మోరిగావ్‌లో 40వేలమందికి పైగా నిరాశ్రయులయ్యారని అస్సాం స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ(ASDMA). ఆరు జిల్లాల్లో 365 రిలీఫ్‌ క్యాంపులు ఏర్పాటు చేసి.. వరద బాధితులకు ఆశ్రయం కల్పిస్తున్నారు.

Assam Floods 2022 ధుబ్రి, దిబ్రుగఢ్‌, గోలాఘాట్‌, నల్బరి, శివసాగర్‌, సౌత్‌ సాల్మరా, టిన్సుకియా, ఉదల్‌గురి జిల్లాల్లో నష్టం ఊహించని స్థాయిలో నమోదు అయ్యింది. రోడ్లు సహా అంతటా బ్రిడ్జిలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 

భారీ ఎత్తున్న నిత్యావసరాల పంపిణీ జరుగుతోంది. రెండు లక్షలకు పైగా కోళ్లు, పెంపుడు జంతువులు మృత్యువాత పడ్డాయి. బ్రహ్మపుత్ర ఉపనది కోపిలి.. ధరమ్‌తుల్‌ దగ్గర ప్రమాద స్థాయికి దాటి ప్రవహిస్తుండడంతో.. ఏం జరుగుతుందో అనే ఆందోళన నెలకొంది.

ఎస్డీఆర్‌ఎఫ్‌ కింద 324 కోట్ల రూపాయల సాయం ప్రకటించింది కేంద్రం. వాన ప్రభావం తగ్గినా.. వరదలతో నీట మునిగిన ఇళ్లలోకి వెళ్లేందుకు జనాలు ఇష్టపడడం లేదు.

మరిన్ని వార్తలు