అస్సాంలో బీభత్సం సృష్టిస్తున్న​ వరదలు...ముగ్గురు మృతి

15 May, 2022 17:47 IST|Sakshi

Assam Floods Nearly 25,000 people affected: దేశంలో అనేక రాష్ట్రలలోని ప్రజలు భయంకరమైన ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే అస్సాం మాత్రం అకాల వర్షాలతో వరదల్లో చిక్కుకుంది. అసోంలోని దిమా హసావో జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఒక మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఏఎస్డీఎంఏ) తెలిపింది.

కొండ జిల్లా ఆకస్మిక వరదలు కారణంగా కొండ చరియలు విరిగిపడటంతో అనేక ప్రాంతాల్లో రోడ్డు, రైలు మార్గాలు దెబ్బతిన్నాయని వెల్లడించింది. కొండచరియలు విరిగిపడటంతో జటింగా-హరంగాజావో, మహూర్-ఫైడింగ్ వద్ద రైల్వే లైన్ నిలిచిపోయింది. గెరెమ్లాంబ్రా గ్రామం వద్ద మైబాంగ్ సొరంగం వద్ద కొండచరియలు విరిగిపడటం వల్ల రహదారి బ్లాక్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. అస్సాంలో ఎడతెరిపి లేకుండా కురిసిన అకాల వర్షాల కారణంగా సుమారు ఐదు జిల్లాలోని దాదాపు 25000 మంది ప్రజలు వరదల బారిన పడ్డారు.  ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

వరదలు సృష్టించిని విధ్వంసం:

  • న్యూ కుంజంగ్, ఫియాంగ్‌పుయ్, మౌల్‌హోయ్, నమ్‌జురాంగ్, సౌత్ బగేటార్, మహాదేవ్ తిల్లా, కలిబారి, నార్త్ బాగేటార్, జియోన్, లోడి పాంగ్‌మౌల్ గ్రామాలలో కొండచరియలు విరిగిపడడంతో దాదాపు 80 ఇళ్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయని ఏఎస్డీఎంఏ తెలిపింది.
  • అస్సాంలోని ఇప్పటి వరకు కాచర్‌, దేమాజీ, హోజాయ్‌, కర్బీ అంగ్లాంగ్‌ వెస్ట్‌, నాగావ్‌, కమ్రూవ్‌ ఈ ఆరు జిల్లాలు వరదల వల్ల ప్రభావితమయ్యాయి. ఆరు జిల్లాలో 94 గ్రామాలకు చెందిన 24,681 మంది వరద బారిన పడ్డారు. ఒక్క కాచర్‌ జిల్లాలోనే 21,000 మంది వరద బారిన పడ్డారు. ఆ తర్వాతి స్థానంలో కర్బీ ఆంగ్లోంగ్ వెస్ట్ దాదాపు 2,000 మంది బాధితులు, ధేమాజీలో 600 మందికి పైగా ప్రజలు ప్రళయం బారిన పడ్డారు.
  • ఆర్మీ, పారామిలిటరీ బలగాలు, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, ఎస్డీఆర్‌ఎఫ్‌, సివిల్ అడ్మినిస్ట్రేషన్‌తో సహా క్యాచర్, హోజాయ్ జిల్లాలకు చెందిన శిక్షణ పొందిన వాలంటీర్లు దాదాపు 2,200 మందిని రక్షించారు.

(చదవండి: పెదవుల పై ముద్దు పెట్టుకోవడం అసహజ నేరం కాదు)

మరిన్ని వార్తలు