వేలంలో రికార్డ్‌ ధర పలికిన అస్సాం మనోహరి టీ పొడి.. కిలో ఎంతంటే..

14 Dec, 2021 20:36 IST|Sakshi

దిస్పూర్‌: అమ్మాయిలు-అబ్బాయిలు, పేదవారు-ధనికులు, చిన్న- పెద్దవాళ్లు అనే ఏ తేడా లేకుండా అందరూ ఇష్టపడి తాగేది చాయ్(టీ).. మిగతా దేశాలతో పోలిస్తే భారతీయులకు టీ మీదున్న మక్కువ అంతా ఇంతా కాదు.. ఏ పనిలో ఉన్నా ఎక్కడున్న కచ్చితంగా రోజుకు ఒకసారైనా కప్పు టీ తాగాల్సిందే. టీ అనగానే గుర్తొచ్చిది అస్సాం రాష్ట్రం. ఎందుకంటే అక్కడ ఉత్పత్తయ్యే టీ పొడి ఎంతో ప్రత్యేకం. అస్సాంలో ఉత్పత్తి అయిన టీ పొడికి భలే డిమాండ్​ ఉంటుంది. అందుకే ఏటా పలు సంస్థలు అరుదైన రకానికి చెందిన కొన్ని టీ పొడులను వేలం వేస్తాయి. 

ఈ క్రమంలో తాజాగా మనోహరి గోల్డ్​ టీ తన రికార్డును తానే బద్దలు కొట్టి మరోసారి చరిత్ర సృష్టించింది. గువాహతి టీ ఆక్షన్ సెంటర్‌లో జరిగిన వేలంలో మనోహరి గోల్డ్‌ టీ కిలో టీ పొడి రూ. 99,999కు అమ్ముడుపోయింది. గతేడాది వేలంలో ఈ ధర రూ.75,000గా ఉంది. సౌరవ్​ టీ ట్రేడర్స్​అనే సంస్థ మంగళశారం ఉదయం కిలో టీ పొడిని రూ. 99,999కు కొనుగోలు చేసింది. 
చదవండి: షాకింగ్‌: బార్‌లో సీక్రెట్‌ రూమ్‌.. అద్దం పగలగొడితే 17 మంది యువతులు..

ఈ సందర్భంగా మనోహరి టీ ఎస్టేట్‌ యాజమాని రాజన్‌ లోహియామాట్లాడుతూ.. టీ వేలంలో మరోసారి చరిత్ర సృష్టించామన్నారు. టీ పొడి నాణత్యలో రాజీపడమని స్పష్టం చేశారు. అస్సాం టీకి కీర్తిని తెచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. కాగా  ప్రస్తుతం అస్సాంలో మొత్తం 800కి పైగా టీ తోటలు ​ ఉన్నాయి. ఏటా 650 మిలియన్​ కిలోల టీని అసోం ఉత్పత్తి చేస్తుంది. ఇది దేశంలోని టీ ఉత్పత్తిలో 52 శాతం.


చదవండి: రోడ్డు ప్రమాదానికి గురైన ఆరోగ్యశాఖ మంత్రి .. ఆసుపత్రికి తరలింపు

మరిన్ని వార్తలు