పదేళ్లలో 25 సార్లు లవర్స్‌తో జంప్‌: ‘నా భార్య నాకు కావాలి’

9 Sep, 2021 21:13 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

డిస్పూర్‌: భార్య పరాయి వ్యక్తితో అవసరం ఉండి మాట్లాడితేనే.. అనుమానంతో ఆమెను రాచి రంపాన పెట్టే భర్తలున్నారు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వార్త ఇందుకు పూర్తిగా భిన్నం. ఇక్కడ ఓ మహిళ పెళ్లైన నాటి నుంచి దాదాపు 25 సార్లు పరాయి మగాళ్లతో వెళ్లిపోయింది. భార్య ఇలాంటి నీచమైన పని చేసినప్పటికి ఆమె భర్త ఒక్కమాట అనలేదు. పైగా ఆమెతోనే కలిసి ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ వివరాలు..

అసోంలోని నాగావ్ జిల్లా మారుమూల గ్రామం ధింగ్ లహ్కర్‌కు చెందిన ఓ వ్యక్తి డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు. పదేళ్ల క్రితం అతడికి వివాహం అయ్యింది. ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి ఉన్నారు. భార్య అంటే అతడికి ప్రాణం. ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. కానీ అతడి భార్యకు.. భర్త కన్నా పరాయి పురుషుల మీద ప్రేమ ఎక్కువ. (చదవండి: రెడ్‌ హ్యాండెడ్‌గా భార్యకు దొరికి..)

ఈ క్రమంలో సదరు మహిళ పెళ్లైన నాటి నుంచి గ్రామంలోని పలువురు యువకులతో వివాహేతర సంబంధాలు నడిపేది. అంతటితో ఆగక వారితో కలిసి ఇంటి నుంచి పారిపోయేది. కొన్ని నెలల తర్వాత తిరిగి వచ్చేది. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. అలా తిరిగి వచ్చిన ప్రతిసారి భర్త ఆమెను ఆదరించాడు. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా భార్యను స్వీకరించేవాడు. (చదవండి: భార్య ఊరికి వెళ్లగానే ఇంటికి పిలిపించుకుని..)

ఇలా పదేళ్ల నాటి నుంచి సదరు మహిళ 24 సార్లు పలువురు వ్యక్తులతో వెళ్లిపోయి.. కొన్ని నెలల తర్వాత తిరిగి వచ్చింది. ఆమె ప్రవర్తన పట్ల అత్తింటివారు, ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినా.. తిట్టినా.. ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. తాజాగా ఈ నెల 4న మరోసారి అనగా 25వ సారి మరో ప్రియుడితో పారిపోయింది. 

ఈ సందర్భంగా సదరు మహిళ భర్త మాట్లాడుతూ.. ‘‘నా భార్య అంటే నాకు చాలా ప్రేమ. తన మీద నాకు అసలు కోపం రాదు. ఇక ఇంటి నుంచి పారిపోయి తిరిగి వచ్చిన ప్రతిసారి నా భార్య ఇక మీదట ఇలా చేయను అని ప్రమాణం చేసేది. కానీ మాట మీద నిలబడలేకపోయేది. ఈ సారి కూడా అదే చేసింది. నా చిన్న కొడుక్కి మూడు నెలలుంటాయి. వాడిని పక్కింట్లో వదిలేసి ప్రియుడితో కలిసి పారిపోయింది. మేకలకు మేత తెస్తాను.. బాబును చూడమని వారికి చెప్పి వెళ్లిపోయింది. ఈ సారి 22 వేల రూపాయల డబ్బు, కొన్ని వస్తువులు తీసుకుని ఇంటి నుంచి పారిపోయింది. ఎవరితో వెళ్లిపోయిందో.. ఎన్నాళ్లకు తిరిగి వస్తుందో తెలియదు’’ అన్నాడు. 

అంతేకాక ‘‘నేను నా భార్యను నిజాయతీగా ప్రేమిస్తున్నాను. ఈసారి కూడా తను తిరిగి వస్తే ఆహ్వానిస్తాను. దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడం.. పంచాయతీ పెట్టడం చేయను. పైగా మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి బాధ్యత ఎవరు తీసుకుంటారు. నా భార్య కోసం ఎదురు చూస్తున్నాను’’ అని తెలిపాడు. 

చదవండి: ఒక చేత్తో స్కూటీ.. మరో చేత్తో ఆమెను అసభ్యంగా

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు