ఉప ఎన్నికల ఫలితాలు: ఏడు చోట్ల గెలిచిన అభ్యర్థులు వీరే

8 Dec, 2022 20:26 IST|Sakshi

Assembly Lok Sabha Bypoll Results

దేశంలో ఏడుస్థానాల(ఒక లోక్‌సభతో కలిపి) ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. యూపీ అసెంబ్లీ ఒకటి, బీహార్‌లో ఒకటి మినహాయించి మిగిలిన చోట్ల సిట్టింగ్‌ క్యాండిడేట్ల మరణంతో ఈ ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి.  ఏడు చోట్ల గెలుపొందిన అభ్యర్థులను పరిశీలిస్తే..

మెయిన్‌పురి లోక్‌సభ స్థానంలో డింపుల్‌ యాదవ్‌(ఎస్పీ) విజయం సాధించింది. 2.88 లక్షల మెజార్టీతో డింపూల్‌ గెలుపొందారు.

► ఖతౌలీ నియోజవవర్గం స్థానాన్ని ఎస్పీ మిత్ర పక్షం రాష్ట్రీయ లోక్‌ దళ్‌ అభ్యర్థి మదన్‌ భయ్యా విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు.

► యూపీలోని రాంపూర్ సదర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ఆకాశ్ సక్సేనా అనూహ్య విజయం సాధించారు. సమాజ్ వాదీ పార్టీకి చెందిన అసిమ్ రాజాపై 33 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా ద్వేషపూరిత ప్రసంగం కేసులో ఎస్పీ ఎమ్మెల్యే ఆజం ఖాన్‌పై అనర్హత వేటు పడటంతో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ సదర్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికకు కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ) దూరంగా ఉన్నాయి. దీంతో బీజేపీ,  సమాజ్‌వాదీ పార్టీ మధ్యే ప్రధాన పోటీ కొనసాగింది.

బీహార్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. కుర్హానీ అసెం‍బ్లీ స్థానం నుంచి పోటీలోకి దిగిన కేదార్‌ ప్రసాద్‌ గుప్తా.. మహాఘట్‌బంధన్ అభ్యర్థిపై 3,645 ఓట్ల తేడాతో విజయం సాధించారు.  జేడీయూతో తెగతెంపులు చేసుకున్న తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో బీజేపీ స్వతంత్రంగా గెలిపొందింది.

ఒడిశాలోని పదంపూర్ అసెంబ్లీ స్థానంలో బీజేడీ అభ్యర్థి బర్షా సింగ్ బరిహా 42,679 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ బీజేపీ ఒడిపోయినప్పటికీ 2019 ఓట్ల శాతాన్ని నిలబెట్టుకోగలిగింది. కాంగ్రెస్ మాత్రం డిపాజిట్ కోల్పోయింది. 

 రాజస్థాన్‌లోని సర్దార్‌షహర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్ శర్మ 26,852 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

ఛత్తీస్‌గఢ్‌లోని భానుప్రతాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి బ్రహ్మానంద్‌ నేతమ్‌పై కాంగ్రెస్‌ అభ్యర్థి సావిత్రి మాండవి 21, 171ఓట్ల తేడాతో గెలుపొందారు.

► అదే సమయంలో అసెంబ్లీ నియోజకవర్గం రామ్‌పూర్‌లోనూ సమాజ్‌వాదీ అభ్యర్థి అసిమ్‌ రాజా ముందంజలో కొనసాగుతున్నారు. కథౌలీలో ఆర్‌ఎల్‌డీ అభ్యర్థి దూసుకుపోతున్నారు.

ఒడిషా పదంపూర్‌లో అధికార బీజేడీ అభ్యర్థి బర్షా సింగ్‌ బరిహా ఆధిక్యంలో ఉన్నారు. 

► బీహార్‌ కుర్హానీలో.. జేడీయూ ఆధిక్యంలో కొనసాగుతోంది.

► రాజస్థాన్‌ సర్దార్‌షాహర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

► ఛత్తీస్‌గఢ్‌(భానుప్రతాప్‌పూర్‌)లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.

న్యూఢిల్లీ: ఒకవైపు గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు దేశంలో మరో ఏడుస్థానాల(ఒక లోక్‌సభతో కలిపి) ఉప ఎన్నికల ఫలితాలపై కూడా ఆసక్తి నెలకొంది. యూపీ అసెంబ్లీ ఒకటి, బీహార్‌లో ఒకటి మినహాయించి మిగిలిన చోట్ల సిట్టింగ్‌ క్యాండిడేట్ల మరణంతో ఈ ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ప్రత్యేకించి సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ మరణంతో ఖాళీ అయిన మెయిన్‌పురి పార్లమెంట్‌ స్థానం ఎవరి కైవసం అవుతుందా? అని ఉత్కంఠ నెలకొంది. 

గుజరాత్‌ ఎన్నికల ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

>
మరిన్ని వార్తలు