ఒపినీయన్‌ పోల్‌: వచ్చే ఎన్నికల్లో వారిదే గెలుపు

27 Feb, 2021 21:44 IST|Sakshi

న్యూఢిల్లీ: పంచతంత్రంగా పేర్కొన్నే ఐదు అసెంబ్లీల ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే అంశం దేశవ్యాప్తంగా ఉత్కంఠగా మారింది. ఈ ఉత్కంఠ నేపథ్యంలో ఓ సర్వే చెబుతున్న ఫలితాలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది. మళ్లీ పశ్చిమబెంగాల్‌లో మమత, కేరళలో వామపక్షాలే, అస్సోలో బీజేపీ ప్రభుత్వాలే ఏర్పాటు చేస్తాయని.. ఇక తమిళనాడులో పదేళ్ల తర్వాత డీఎంకే కూటమి, ఇక పుదుచ్చేరిలో బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని సర్వే చెప్పింది. ఈ అసెంబ్లీ ఎన్నికలు జాతీయ రాజకీయాలను తీవ్రంగా ప్రభావం చూపేవి కావడంతో దేశవ్యాప్తంగా దీనిపై చర్చ నడుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనే అంశంపై ఏబీపీ-సీ ఓటర్‌ సంస్థ సర్వే చేసింది. అంటే ఒపీనియన్‌ పోల్‌ నిర్వహించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో చేసిన సర్వే ప్రకారం పై ఫలితాలు వెల్లడయ్యాయి. ఏ పార్టీ గెలుస్తుందనే దానితో పాటు ఏ పార్టీకి ఎన్ని శాతం ఓట్లు.. ఎన్నేసి సీట్లు వస్తాయో ఓ అంచనా రూపొందించింది. ఆ ఒపినీయన్‌ పోల్‌ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఈ సర్వే ఒక అంచనా మాత్రమే. ఏది ఏమున్నా ప్రజల తీర్పు ఎలా ఉంటుందో ఏప్రిల్‌ 2వ తేదీన తెలియనుంది.

పశ్చిమ బెంగాల్‌
పదేళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకే మళ్లీ పట్టం కట్టే అవకాశం ఉంది. మళ్లీ మమత బెనర్జీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తారని అభిప్రాయాలు వచ్చాయి. 
తృణమూల్‌ కాంగ్రెస్‌: 148-164 సీట్లు (43 శాతం ఓట్లు)
బీజేపీ: 92-108 సీట్లు (38 శాతం ఓట్లు)
కాంగ్రెస్‌ + మిత్రపక్షాలు‌: 31-39 సీట్లు (13 శాతం ఓట్లు)

కేరళ
దేవభూమిగా ఉన్న కేరళలో మళ్లీ వామపక్ష కూటమికే అధికారం దక్కే అవకాశాలు ఉన్నాయి.
ఎల్‌డీఎఫ్‌: 83-91 సీట్లు
యూడీఎఫ్‌: 47-55 సీట్లు
బీజేపీ: 0-2 సీట్లు, ఇతరులు 0-2 సీట్లు

తమిళనాడు
ఈసారి తమిళనాడులో ప్రభుత్వం మారే అవకాశం ఉంది. పదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న అన్నాడీఎంకేకు పరాభవం తప్పేటట్టు లేదు. మిత్రపక్షాలతో కలిసి డీఎంకే అధికారం చేపట్టేలా పరిస్థితులు ఉన్నాయి.
డీఎంకే + మిత్రపక్షాలు: 154-162 సీట్లు
అన్నాడీఎంకే: 58-66 సీట్లు
ఇతరులు: 8-20 సీట్లు

అసోం
ఈశాన్య ప్రాంతం రాష్ట్రంగా ఉన్న అసోంలో మళ్లీ కమలం విరబూయనుంది. బీజేపీకి రెండోసారి అధికారం దక్కే అవకాశాలు ఉన్నాయి.
బీజేపీ+ మిత్రపక్షాలు: 68-76 సీట్లు
కాంగ్రెస్‌ + మిత్రపక్షాలు: 43-51 సీట్లు
ఇతరులు: 5-10 సీట్లు

పుదుచ్చేరి
కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న పుదుచ్చేరిలో ఇటీవల పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. అయితే ఆ పరిణామాలు బీజేపీకి ప్లస్‌ అయ్యాయని తెలుస్తోంది. ఎందుకంటే జరగబోయే ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందనుందని ఈ సర్వే తెలిపింది. అధికారంలో బీజేపీకి దక్కేలా ఉంది.
బీజేపీ+ మిత్రపక్షాలు: 17-21 సీట్లు
కాంగ్రెస్‌+ మిత్రపక్షాలు: 8-12 సీట్లు
ఇతరులు: 1-3 సీట్లు

చదవండి: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ఇదే..

చదవండి: మూడో కూటమి.. నేనే ముఖ్యమంత్రి అభ్యర్థి

మరిన్ని వార్తలు