వీడియో: ఫారినర్‌ను అసభ్యంగా తాకుతూ ఆ ఆటోడ్రైవర్‌ వేధింపులు.. వైరల్‌

4 Jul, 2023 21:27 IST|Sakshi

ఆతిథ్యంలో విదేశీయులను మురిపించేందుకు ఓ పక్క ప్రభుత్వాలు ప్రయత్నిస్తుంటే.. మరోపక్క కొందరు మాత్రం తమ చేష్టలతో అతిథి దేవోభవ అనే సూత్రానికి తూట్లు పొడుస్తున్నారు. తాజాగా ఓ ఆటోడ్రైవర్‌.. ఓ విదేశీ పర్యాటకురాలితో వ్యవహరించిన తీరుపై సర్వత్రా​ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఓ ఆటో డ్రైవర్‌ ఫారినర్‌లను వెంబడిస్తూ.. వాళ్లతో పాటే నడుస్తూ.. ఆమె మీద ఎక్కడపడితే అక్కడ చేతులేస్తూ వెళ్లాడు. ఆ క్షణం ఆమె ఇబ్బందిగా ఫీలవుతున్నా సరే పట్టించుకోకుండా ముందుకు వెళ్లాడతను. దీంతో అతన్ని వదిలించుకునేందుకు ఆ జంట ప్రయత్నించింది. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో ఇది చోటు చేసుకుంది.

ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ ఈ వీడియోను తన ట్విటర్‌ వాల్‌ మీద పోస్ట్‌ చేసి చర్యలు తీసుకోవాలని సీఎం గెహ్లట్‌, రాజస్థాన్‌ పోలీసులను కోరారు. 

అయితే.. రాజస్థాన్‌ పోలీసులు ఇప్పటిదాకా బాధితులను, నిందితుడిని గుర్తించలేదని తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఇష్టం లేని పెళ్లి.. భలే ట్విస్ట్‌ ఇచ్చిందిగా!

మరిన్ని వార్తలు