అందుకే అదానీకి ఇచ్చాం : కేంద్రమంత్రి వివరణ

21 Aug, 2020 08:30 IST|Sakshi

బిడ్డింగ్ ప్రక్రియలో కేరళ ప్రభుత్వం అర్హత సాధించలేదు : హర్దీప్ సింగ్ పూరి

తిరువనంతపురం: తిరువనంతపురం అంత‌ర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రైవేటీకరించే నిర్ణయానికి సంబంధించిన వాస్తవాలకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఆరోపించారు.  విమానాశ్రయ ప్రైవేటీకరణపై కేరళ సీఎం పినరయి విజయన్ వ్యతిరేకత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన ట్విటర్ ద్వారా స్పందించారు.  

అంతర్జాతీయ బిడ్డింగ్ ప్రక్రియలో కేరళ ప్రభుత్వం అర్హత సాధించలేదంటూ వరుస ట్వీట్లలో ఈ నిర్ణయంపై వివరణ ఇచ్చారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) రీతిలో 50 ఏళ్లుగా లీజుకు ఇవ్వడానికి కేంద్రం పారదర్శకంగా నిర్ణయ తీసుకుందని (2019లో) వివరించారు. అదానీ ప్రయాణీకుడికి 168 రూపాయల చొప్పున కోట్ చేయగా, కేరళ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్ (కెఎస్ఐడీసీ) 135 రూపాయల చొప్పున, మూడవ క్వాలిఫైయింగ్ బిడ్డర్ 63 రూపాయలు కోట్ చేశారన్నారు. 10 శాతం తేడా ఉండి ఉంటే ఈ బిడ్డింగ్ కేరళకే దక్కి ఉండేదని 19.64 శాతం ఉన్న నేపథ్యంలో అదానీని ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. (ప్రైవేటిక‌ర‌ణ‌కు ఒప్పుకోం : కేర‌ళ సీఎం)

కాగా ప్రధానమంత్రి  మోదీ తనకు ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని విజ‌య‌న్ ఆరోపించారు. స్పెష‌ల్ పర్సస్ వెహికిల్‌(ఎస్‌పీవీ)కి ఇవ్వాల‌ని కేర‌ళ ప‌లుసార్లు తాను విజ్ఙప్తి చేసినట్టు విజ‌య‌న్ గుర్తు చేశారు. 2003లో విమానయాన‌శాఖ ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా కేబినెట్ నిర్ణయం ఉందంటూ ప్రధానికి రాసిన ఒక లేఖ‌లో ఆరోపించిన సంగతి తెలిసిందే. అటు కేంద్ర నిర్ణయాన్ని కేరళ ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తుండగా,  కాంగ్రెస్ నేత తిరువనంతపురం ఎంపీ శ‌శిథ‌రూర్ స్వాగతించడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు