స్వతం‍త్ర భారతి: రాజీవ్‌ గాంధీ హత్య

15 Jul, 2022 15:18 IST|Sakshi

రాజీవ్‌ గాంధీ శ్రీలంకలోని అతివాద తమిళ టైగర్లకు మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత ఆయనే వారి మీద పోరాడేందుకు శ్రీలంకకు భారత సైనిక దళాలను పంపారు. దాంతో మిత్రులు శత్రువులైపోయారు. టైగర్లు ఆయన మీదకు మానవ బాంబును ప్రయోగించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని శ్రీ పెరంబుదూరుకు చేరుకున్న రాజీవ్‌ దారుణంగా హత్యకు గురయ్యారు.

రాజీవ్‌ జీవితం మొత్తం విషాదంగానే సాగింది. రాజకీయాలకు దూరంగా ప్రశాంతంగా ఉన్న ఆయనకు రాజకీయాల్లోకి ప్రవేశించి తీరవలసిన అగత్యాన్ని ఊహించని పరిస్థితులు కల్పించాయి. తల్లికి తోడుగా రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్న సోదరుడు సంజయ్‌ గాంధీ విమానం ప్రమాదంలో చనిపోయారు. తల్లి ఇందిరా గాంధీ హత్యకు గురయ్యారు. అనంతరం ప్రధానిగా రాజీవ్‌ భోఫోర్స్‌ కుంభకోణం అనే అప్రతిష్టను ఎదుర్కొన్నారు. చివరికి తమిళ టైగర్‌ల ప్రతీకారానికి బలయ్యారు.

ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు

  • రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ‘ఆలిండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ అంగన్‌వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌’ ఆవిర్భావం. 
  • ప్రధానిగా పీవీ నరసింహారావు.
  • తమిళనాడు ముఖ్యమంత్రిగా తొలిసారి జయలలిత ప్రమాణ స్వీకారం. 
  • ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర హోమ్‌ శాఖ. 

 (చదవండి: పెళ్లి వద్దనుకున్న ఫ్రీడమ్‌ ఫైటర్‌ )

మరిన్ని వార్తలు