అంగారక కక్ష్యలోకి ‘మామ్‌’

7 Aug, 2022 18:28 IST|Sakshi

2014 సెప్టెంబరు 24న ఉదయం గం. 7.17.32 లకు ‘మామ్‌’.. అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించే సంక్లిష్ట దశను సజావుగా అధిగమించింది. అనంతరం 8.15 గంటలకు భూమికి సమాచారాన్ని చేరవేసింది. జీవాన్వేషణ, గ్రహ నిర్మాణం వంటి అంశాలపై  పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ చేపట్టిన ఈ ‘ప్రాజెక్ట్‌ అంగారకయాన్‌’ లేదా ‘మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌’ (మామ్‌) ను 2013 నవంబరు 5న శ్రీహరికోట లోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రము నుండి  విజయవంతంగా ప్రయోగించారు.

పీఎస్‌ఎల్‌వీ సీ25 ఉపగ్రహ వాహకనౌక ద్వారా  ‘మామ్‌’ రోదసిలోకి దూసుకెళ్లడంతో భారత్‌ అంగారకయానం మొదలైంది. దాంతో అంగారక గ్రహంపై విజయవంతంగా ప్రయోగాలు నిర్వహించిన నాలుగో దేశంగా భారత్‌ గుర్తింపు పొందింది. ప్రయోగించిన తొలి ప్రయత్నంలోనే విజయం సాధించిన ఈ ప్రాజెక్టుకు రాకెట్‌ శాస్త్రవేత్త నందిని హరినాథ్‌ ఆపరేషన్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా వ్యవహరించారు.

ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు

యువ నటుడు ఉదయ్‌కిరణ్, సీనియర్‌ నటులు అంజలీదేవి, అక్కినేని నాగేశ్వరరావు; సుచిత్రాసేన్, సునంద   పుష్కర్, బాలూ మహేంద్ర, రూసీ మోడీ, కె.బాలచందర్‌.. కన్నుమూత.

భారత ప్రధానిగా నరేంద్ర మోదీ తొలిసారి ప్రమాణ స్వీకారం. 

ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం. 

మరిన్ని వార్తలు