స్వతంత్ర భారతి 1975/2022

29 Jun, 2022 10:33 IST|Sakshi

∙భూకక్ష్యలోకి విజయవంతంగా తొలి భారతీయ ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ ప్రయోగం.
∙పశ్చిమ బెంగాల్‌లో గంగానదిపై ఫరక్కా బ్యారేజ్‌ ప్రారంభం 
∙రాయ్‌ బరేలీ లోక్‌సభ ఎంపీగా 1971లో విజయం సాధించిన ఇందిరాగాంధీ  ఎన్నిక చెల్లదని అలహాబాద్‌ కోర్టు సంచలనాత్మక తీర్పు. 
∙దేశంలో ఎమర్జెన్సీ విధింపు

షోలే విడుదల
షోలేలోని అజరామరమైన దృశ్యాలకు అంజలి ఘటించిన ‘ఝంకార్‌ బీట్స్‌’ దర్శకుడు సుజయ్‌ ఘోష్, ‘‘అది భారతదేశ గాడ్‌ఫాదర్‌’’ అని అన్నారు. ఇక షోలే దర్శకుడు రమేశ్‌ సిప్పీకే మళ్లీ అలాంటి సినిమా తీయడం సాధ్యం కాలేదు. నటీనటుల చక్కని అభినయం, ఉత్కంఠ కలిగించే పోరాట సన్నివేశాలు, చురుకైన పాత్రలు, వెంటాడే నేపథ్య సంగీతం.. ఇలాంటి కారణాలు ఎన్నో ఉన్న ఈ చిత్రం ముంబై చిత్ర పరిశ్రమకు నిర్ణయాత్మకంగా మారిపోయింది. భారతీయ ప్రేక్షకులకైతే అదొక చిరస్మరణీయ దృశ్యగీతంలా నిలిచిపోయింది.

భారతదేశ తొలి 70 ఎం.ఎం. అద్భుతం ‘షోలే’! భారీ తారాగణంతో, భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి పరిపూర్ణమైన స్క్రిప్టు చోదకశక్తిగా నిలిచింది. ఆగ్రహంతో ఉన్న జాతి మనోభావాలను తెర మీద గొప్పగా ఒలికించడంలో ఆరితేరిన సలీం ఖాన్, జావేద్‌ అక్ఖర్‌లు రచించిన స్క్రిప్టు అది. షోలే చిత్రం 1975 ఆగస్టు 15న విడుదలైంది. నాలుగు దశాబ్దాలు దాటి, ఐదో దశాబ్దం దగ్గరికి వస్తున్నా కూడా షోలే ఇప్పటికీ సినిమాలు, వాణిజ్య ప్రకటనల రూపశిల్పులకు స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తూనే ఉంది. 

మరిన్ని వార్తలు