శతమానం భారతి: అమృతమయం.. లక్ష్యం 2047

9 Jul, 2022 15:08 IST|Sakshi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ఈ ఎనిమిదేళ్ల పాలనాకాలంలో ఇప్పటికే మైలురాళ్లు అనదగిన విజయాలు చేకూరాయి. పేదరికం రేటు 22 నుంచి 10 శాతానికి తగ్గింది. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద రోడ్డు నెట్‌వర్క్‌ ఏర్పడింది. 6.53 లక్షల పాఠశాల భవనాలు నిర్మితమయ్యాయి. రెండు ‘మేడిన్‌ ఇండియా’ వ్యాక్సిన్లు జాతికి అందాయి. కోవిడ్‌ కాలంలోనూ గతేడాది ఎగుమతుల్లో భారతదేశం 418 బిలియన్‌ డాలర్లతో రికార్డు సృష్టించింది. ఇక ఆహారధాన్యాల ఉత్పత్తి ఇండియా చరిత్రలోనే అత్యధికంగా 316.06 మిలియన్‌ టన్నులకు పెరిగింది. వైభవోపేతమైన భారతదేశ ఔన్నత్యాన్ని తిరిగి సాధించడానికి కేంద్రంలోని ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందడుగులు వేస్తోంది. మన సమాజంలోని అట్టడుగు వర్గాలకు– పేదల నుండి వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీలు, గిరిజనులు, అణ గారిన వర్గాలు, మహిళలు, యువత వరకు సాధికారత కల్పించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని దాని నిజమైన అర్థంలో బలోపేతం చేయడం ఒక అద్భుతమైన ప్రయాణం. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ను దేశం జరుపుకొంటున్న సందర్భంగా– దేశం ముందున్న సవాళ్లు, సమస్యలను పరిష్కరించి గతకాలపు వైభవాన్ని పునరుద్ధరించేందుకు ప్రధాని సంకల్పం తీసుకున్నారు. వచ్చే పాతికేళ్లలో భారతదేశాన్ని సంతోషకరమైన, సౌభాగ్యవంతమైన దేశంగా మార్చేందుకు కష్టపడి పనిచేయడానికి కట్టుబడి ఉన్నామని అందరం మరోసారి ప్రతిజ్ఞ చేయవలసిన సమయం ఈ అమృతోత్సవాలే.

మరిన్ని వార్తలు