ఇళయ మారుతం

2 Jun, 2022 10:35 IST|Sakshi

శ్రవణానంద చక్రవర్తి ఇళయరాజా పుట్టినరోజు నేడు

ఇటీవల విడుదలైన  ‘అంబేడ్కర్‌ అండ్‌ మోదీ– రిఫార్మర్స్‌ ఐడియాస్, పెర్ఫార్మర్స్‌ ఇంప్లిమెంటేషన్‌ అనే పుస్తకానికి రాసిన ‘ముందుమాట’ లో ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా మోదీని అంబేడ్కర్‌తో పోల్చి తాజా వార్తల్లోకి వచ్చారు. ‘‘దేశాభివృద్ధి, పరిశ్రమల రంగం, సామాజిక న్యాయం, మహిళాభ్యున్నతి వంటి వాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అంబేద్కర్‌ ఆలోచనలను అనుసంధానం చేసే అంశాలకు అధ్యయనంలా ఈ పుస్తకం ఉంది. ప్రధాని మోదీ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ‘మేక్‌ ఇన్‌  ఇండియా’ ఎన్నో రికార్డులను సృష్టించింది.

సామాజిక న్యాయం కోసం ప్రధాని మోదీ అనేక చట్టాలను అమలుచేస్తున్నారు. ప్రధాని మోదీకి, అంబేడ్కర్‌కు అనేక విషయాల్లో పోలికలు ఉన్నాయి’’ అని ఇళయరాజా ఆ ముందుమాటలో రాశారు. ఇళయరాజా స్వాతంత్య్రానికి పూర్వం 1943 లో తమిళనాడులోని పన్నైపురంలో జూన్‌ 2న జన్మించారు. దళిత కుటుంబం నుంచి వచ్చిన ఇళయరాజా స్వయంకృషితో ఎదిగిన మహోజ్వల సంగీతకారులలో ఒకరిగా గుర్తింపు పొందారు. 
 

మరిన్ని వార్తలు