ఫూలన్‌దేవి హత్య 25 జూలై 2001

25 Jul, 2022 08:51 IST|Sakshi

పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో అక్కడి సమీపంలోని తన నివాసానికి వెళ్లిన మీర్జాపూర్‌ లోక్‌సభ ఎంపీ పూలన్‌దేవిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ముసుగులు ధరించి వచ్చిన ఆ ఆంగతకుల కాల్పుల్లో ఫూలన్‌దేవి అక్కడిక్కడే మరణించారు.

1981లో ఉత్తరప్రదేశ్‌లోని బెహ్మాయ్‌ గ్రామంలో 22 మంది ఠాకూర్లను ప్రతీకార దాడి చేసి చంపినందుకు ఫూలన్‌ దేవి హత్య జరిగి ఉండవచ్చునని భావించారు. ఫూలన్‌దేవికి ‘బందిపోటు రాణి’ అని పేరు. బాల్యం నుంచీ ఆమె అనేకసార్లు అన్యాయానికి, దౌర్జన్యానికి, అత్యాచారాలకు గురయ్యారు. పదకొండేళ్లకే ఆమెకు నిర్బంధ వివాహం జరిగింది.

ఆ అనుభవాలు ఆమెను చంబల్‌లోయ బందిపోటుగా మార్చాయి. అగ్రవర్ణాల వారికి, పోలీసులకు ఆమె సింహస్వప్నం అయ్యారు. చివరికి ప్రభుత్వ మధ్యవర్తిత్వంతో చట్టానికి లొంగిపోయారు. 1998లో తన 34 ఏళ్ల వయసులో పూలన్‌ దేవి సమాజ్‌వాదీ పార్టీ ఎంపీగా ఎన్నికయ్యారు.   

ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు

  • అధికారికంగా కోల్‌కతా అయిన కలకత్తా
  • ఢిల్లీలోని అమెరికా దౌత్యకార్యాలయాన్ని పేల్చేయడానికి ఒసాబా బిన్‌ లాడెన్‌ పన్నిన పథకాన్ని భగ్నం చేసిన పోలీసులు.
  • విమాన ప్రమాదంలో కాంగ్రెస్‌ నేత మాధవరావ్‌ సింధియా దుర్మరణం.
  • గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ. 

(చదవండి: సైనికులు కావలెను.. వేతనం : మృత్యువు, వెల : ఆత్మార్పణం)

మరిన్ని వార్తలు