మొబైల్‌ ఫోన్‌ల శకారంభం

19 Jul, 2022 13:26 IST|Sakshi

జన్‌ధన్, ఆధార్‌ ఔర్‌ మొబైల్‌ అన్నది ఇప్పుడైతే ఆచరణీయ నినాదంలా ధ్వనిస్తోంది కానీ, సెల్‌ ఫోన్‌లు రంగ ప్రవేశం చేసిన కొత్తలో అవి ధనికుల ఆట వస్తువుల్లానే ఉండేవి. ఈ పరిస్థితి 1999 వరకు కొనసాగింది. అసలు 1999 కి కొన్నేళ్ల ముందు వరకు కూడా సాధారణ టెలిఫోన్‌ సైతం కొద్దిమందికే సంక్రమించిన ప్రత్యేక హక్కులా ఉండేది. పరిమితంగా పంచవలసిన ఆస్తిగా ఉండేది. అలాంటిది నేడు దాదాపు 100 కోట్ల మందికి పైగా భారతీయులు చేతిలో సెల్‌ఫోన్‌ లేకుండా గడప దాటడం లేదంటే... అది రెండు విధాన నిర్ణయాల ఫలితమేనని చెప్పాలి.

1990 దశకం మధ్యలో టెలికామ్‌ రంగంలో ప్రైవేట్‌ సంస్థల ప్రవేశాన్ని అనుమతించడంతో అనేక సర్వీస్‌ ప్రొవైడర్‌లు వినిమయదారులకు నాణ్యమైన సేవలు అందించడం ప్రారంభించారు. అప్పటి వరకు సొంత ఇల్లు సంపాదించుకోవడం కన్నా సాధారణ టెలిఫోన్‌ సంపాదించడమే కష్టమన్న పరిస్థితి ఉన్న మన దేశంలో ఎట్టకేలకు ఒక్క ఫోన్‌ చేస్తే చాలు బేసిక్‌ టెలిఫోన్‌ కనెక్షన్‌ వచ్చి వాలిపోవడం మొదలైంది. ఆ పైన, 1999లో లైసెన్స్‌ ఫీజుల శకం అంతరించి ప్రభుత్వం, టెలికామ్‌ ఆపరేటర్లు ఆదాయన్ని పంచుకునే యుగం అవతరించింది. దీంతో ఒకప్పుడు నిముషానికి రు.16 రూపాయలు ఉన్న ఫోన్‌ చార్జీలు ఇప్పుడు పైసల్లోకి పడిపోయాయి.  

ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు

  • డబ్ల్యూ.టి.ఓ. (వర ల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌) లో భారత్‌ చేరిక. 
  • ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ స్థాపన.
  • గ్యాంగ్‌స్టర్‌ ఆటో శంకర్‌కు తమిళనాడు సేలంలోని కేంద్ర కారాగారంలో ఉరి. 
  • దేశంలో ఇంటర్నెట్‌ను లాంఛనంగా ఆరంభించిన వి.ఎస్‌.ఎన్‌.ఎల్‌. (టాటా కమ్యూనికేషన్స్‌) 

(చదవండి: దేశం రెండు ముక్కలైంది నేడే!)

మరిన్ని వార్తలు