ఘట్టాలు: టాటా గ్రూపు ఆవిర్భావం

12 Jun, 2022 15:37 IST|Sakshi

టాటా గ్రూపు ఆవిర్భావం: టాటా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (టాటా గ్రూపు) ని జమ్‌షెడ్జీ నుసర్వాన్జీ టాటా ముంబైలో స్థాపించారు. భారతదేశంలోని ప్రాచీన కంపెనీలలో టాటా ఒకటి. ఈ సంస్థ ప్రస్తుతం ఆరు ఖండాలలో 100 కు పైగా దేశాల్లో 2,46,000 మంది ఉద్యోగులతో తన వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. టాటా గ్రూపునకు ఇరవై లక్షలకు పైగా వాటాదారులు ఉన్నారు. సుమారు 57.7 బిలియన్లకు పైగా విలువైన మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఉన్నాయి.

రసాయనాలు, వినియోగదారుల ఉత్పత్తులు, ఎనర్జీ, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్, సర్వీసెస్‌ మొదలైన వాటితో సహా అనేక ప్రాథమిక వ్యాపార రంగాలలో టాటా గ్రూపు వేళ్లూనుకుని ఉంది. టాటా గ్రూప్‌ స్థాపకుడిగా గుర్తింపు పొందిన జంషెట్జీ టాటాను ‘భారతీయ పరిశ్రమల పితామహుడు’గా అభివర్ణిస్తుంటారు.

(చదవండి: లక్ష్యం 2047.. పరిశ్రమలు)


 

మరిన్ని వార్తలు