స్వతంత్ర భారతి: భిన్నత్వంలో ఏకత్వంలా... భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు

10 Jun, 2022 14:55 IST|Sakshi
కర్నూలు రైల్వే స్టేషన్‌లో 1953 అక్టోబర్‌ 2న జవహర్‌లాల్‌ నెహ్రూ

భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేస్తే దాని వల్ల కుల మత పరమైన వైషమ్యాలు అణగిపోతాయని ఆశించారు. 1956 లో చేపట్టిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు ఈ సూత్రమే ఆధారం. దీనిని మూడు విడతలుగా.. 1956లో దక్షిణాది రాష్ట్రాలలో (ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం), 1960 నాటికి పశ్చిమ రాష్ట్రాలలో (గుజరాత్‌), 1966 నాటికి వాయవ్య ప్రాంతంలో (పంజాబ్, హర్యానా, హిమాచల్‌) అమలు పరిచారు. తర్వాత ఈశాన్య ప్రాంత విభజన (1964, 71) గిరిజన జనాభా ప్రాతిపదికన జరిగింది.

జార్ఖండ్, ఉత్తరాంచల్, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలనూ ఏర్పాటు చేస్తూ 2000 లో ఉత్తరాది కేంద్రభాగంలో మినీ–పునర్వ్యవస్థీకరణ జరిపారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భావనకు ఇది ఒక అరుదైన ప్రయోగం. భాషాపరమైన వ్యవస్థీకరణ భారతదేశ సమాఖ్య వ్యవస్థకు పుష్టిని ఇచ్చింది. 1956లో మొదలైన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ నిరంతరం కొనసాగేలానే ఉంది. ఈ క్రమంలోనే 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. విదర్భ కోసం డిమాండ్‌లు నేటికీ వినిపిస్తూ ఉన్నాయి. కర్నూలు రైల్వే స్టేషన్‌లో 1953 అక్టోబర్‌ 2న జవహర్‌లాల్‌ నెహ్రూ ఆ ముందు రోజే ఆంధ్ర రాష్ట్ర అవతరణ. మూడేళ్లకు 1956 నవంబర్‌ 1న ఆంధ్రా, తెలంగాణాలతో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటైంది.

మరిన్ని వార్తలు