సామ్రాజ్య భారతి: 1922,1923/1947

3 Aug, 2022 18:34 IST|Sakshi

ఘట్టాలు
చౌరీచౌరా (గోరఖ్‌పుర్‌) లో హింసాత్మక ఘటనలు. సహాయ నిరాకరణోద్యమ విరమణకు గాంధీజీ పిలుపు. ఉద్యమ నాయకుల అసంతృప్తి.
‘రాజద్రోహం’ నేరారోపణపై ముంబైలో గాంధీజీ అరెస్టు. ఆరేళ్ల జైలు శిక్ష. రెండేళ్లకే విడుదల.
 స్వరాజ్య పార్టీ అవతరణ. వ్యవస్థాపకులు సి.ఆర్‌.దాస్, మోతీలాల్‌ నెహ్రూ.

చట్టాలు:
(1923) వర్క్‌మెన్‌ కాంపెన్సేషన్‌ యాక్ట్, ఆఫిషియల్‌ సీక్రెట్స్‌ యాక్ట్, ఇండియన్‌ బాయిలర్స్‌ యాక్ట్, కంటోన్మెంట్స్‌ (హౌస్‌–అకామడేషన్‌) యాక్ట్, ఇండియన్స్‌ నేవల్‌ ఆర్మమెంట్‌ యాక్ట్, ఇండియన్‌ మర్చంట్‌ షిప్పింగ్‌ యాక్ట్, కాటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ యాక్ట్‌. 

జననాలు:
హృషికేష్‌ ముఖర్జీ : సినీ దర్శకులు (కలకత్తా); అల్లు రామలింగయ్య : హాస్య నటులు (పాలకొల్లు); దిలీప్‌ కుమార్‌ : బాలీవుడ్‌ నటుడు (పెషావర్‌); ఘంటసాల : గాయకులు, సంగీత దర్శకులు (కృష్ణా జిల్లా); యలవర్తి నాయుడమ్మ : కెమికల్‌ ఇంజినీర్‌ (గుంటూరు జిల్లా); ఎస్‌.రాజేశ్వరరావు : సంగీత దర్శకులు (సాలూరు మండలం); ధర్మభిక్షం : కమ్యూనిస్టు యోధులు (సూర్యాపేట); కుందుర్తి ఆంజనేయులు : కవి (గుంటూరు).
మృణాల్‌ సేన్‌ : సినీ దర్శకులు (బెంగాల్‌ ప్రెసిడెన్సీ); ఎన్టీ రామారావు : సినీ నటులు, రాజకీయ నాయకులు (నిమ్మకూరు); దేవ్‌ ఆనంద్‌ : సినీ నటులు (పంజాబ్‌); ముఖేష్‌ : సినీ నేపథ్య గాయకులు (ఢిల్లీ); కాంతారావు : నటులు (కోదాడ). 

మరిన్ని వార్తలు