సామ్రాజ్య భారతి: 1926,1927/1947 ఘట్టాలు

5 Aug, 2022 18:07 IST|Sakshi

ఘట్టాలు:

  • బాంబేలో ‘బెస్ట్‌’ బస్సులు ప్రారంభం. (బాంబే ఎలక్ట్రిక్‌ సప్లయ్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌). 
  • పాండిచ్చేరిలోని అరవింద ఆశ్రమ బాధ్యతల్ని ‘మదర్‌’ కు (మీరా ఆల్ఫాన్సా) అప్పగించి ఆ విధుల నుంచి శ్రీ అరబిందో విరమణ.
  • భారత స్వయం పాలన కోసం సైమన్‌ కమిషన్‌ ఏర్పాటు.
  • న్యూఢిల్లీలో కౌన్సిల్‌ హౌస్‌ ప్రారంభం.
  • డెహ్రాడూన్‌లో తీవ్ర మతకలహాలు.
  • సిలోన్‌కు గాంధీజీ మొదటి, చివరి పర్యటన.

చట్టాలు:
పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటు. (అదే నేటి యు.పి.ఎస్‌.సి.), ట్రేడ్‌ యూనియన్స్‌ యాక్ట్, గుడ్‌ కాండక్ట్‌ ప్రిజనర్స్‌ ప్రొబేషనల్‌ రిలీజ్‌ యాక్ట్, ఇండియన్‌ బార్‌ కౌన్సిల్స్‌ యాక్ట్, కాటన్‌ ఇండస్ట్రీ (స్టాటిస్టిక్స్‌) యాక్ట్‌. 
ఇండియన్‌ ఫారెస్ట్‌ యాక్ట్, లైట్‌ హౌస్‌ యాక్ట్‌.

జననాలు:
ఓపీ నయ్యర్‌ : సినీ సంగీత దర్శకులు (లాహోర్‌); రాజ్‌ కుమార్‌ : బాలీవుడ్‌ నటుడు (పాకిస్థాన్‌); బాల్‌ థాకరే : రాజకీయనేత, ‘శివసేన’ వ్యవస్థాపకులు (పుణె); మహాశ్వేతాదేవి : బెంగాలీ రచయిత్రి (ఢాకా); రామకృష్ణ హెగ్డే : రాజకీయనేత (కర్ణాటక); జి.వరలక్ష్మి : రంగస్థల, సినీ నటి (ఒంగోలు).
బలివాడ కాంతారావు : నవలా రచయిత (మడపాం); లాల్‌కృష్ణ అద్వానీ : రాజకీయవేత్త, భారత డిప్యూటీ ప్రధాని (కరాచీ); సుందర్‌లాల్‌ బహుగుణ : పర్యావరణ పరిరక్షణ కార్యకర్త (ఉత్తరాఖండ్‌); అంజలీదేవి : నటి (పెద్దాపురం);
నయనతార సెహగల్‌ : ఆంగ్ల భాషా రచయిత్రి (అలహాబాద్‌); నేదునూరి కృష్ణమూర్తి : కర్ణాటక సంగీత విద్వాంసులు (పిఠాపురం); నండూరి రామ్మోహన్‌రావు : పాత్రికేయులు (విస్సన్నపేట). 

(చదవండి: జైహింద్‌ స్పెషల్‌: వీళ్లంతటివాడు పుల్లరి హనుమంతుడు)

మరిన్ని వార్తలు