Sino Indian War In 1962: భారత్‌-చైనా యుద్ధం

16 Jun, 2022 13:29 IST|Sakshi
యుద్ధభూమిలో భారత సైనికులు 

హిందీ చీనీ భాయ్‌ భాయ్‌. 1950ల మధ్యలో చైనాతో భారతదేశం చరిత్రాత్మక శాంతి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఈ నినాదం భారతదేశమంతటా మార్మోగింది. అయితే 1962లో సరిహద్దులో తలెత్తిన ఘర్షణ భారతదేశ ఘోర పరాజయంతో ముగియడంతో ఆ నినాదం హాస్యాస్పదంగా తయారైంది. యుద్ధంలో చైనాతో సంప్రాప్తించిన ఓటమి , అజేయుడని జవహర్‌లాల్‌ నెహ్రూకు ఉన్న పేరుకు మచ్చ తెచ్చింది.

ఆ తర్వాత రెండేళ్లకే ఆయన కన్నుమూశారు. సాయుధ దళాలు, అలీన విధానంపై భారతదేశం విధానంలో కూడా అది మార్పును తెచ్చింది. అణ్వాయుధాల కార్యక్రమాన్ని వేగిరపర్చడంతో పాటు, పటిష్టమైన సైన్య నిర్మాణానికి ప్రభుత్వం దండిగా నిధులు సమకూర్చడం ప్రారంభమైంది. అప్పటికీ ఇప్పటికీ అరవై ఏళ్లు గడిచిపోయినా, సరిహద్దు వివాదం ఇంకా భారత–చైనాల మధ్య ఆరని చిచ్చుగానే ఉండిపోయింది.

యుద్ధకాలం నాటి ‘టైమ్‌’ పత్రిక ముఖచిత్రంగా భారత ప్రధాని నెహ్రూ, చైనా నాయకుడు మావో జెడాంగ్‌

మరిన్ని వార్తలు