ఇండియా@75: జి.ఎస్‌.టి. అమలు పెద్ద ముందడుగు

1 Aug, 2022 12:45 IST|Sakshi

ఆర్థికంగా పురోగమిస్తున్న భారత్‌ వ్యాపారాలను సరళీకృతం చేయడం ద్వారా అత్యున్నత భారత్‌గా శతవర్ష స్వాతంత్య్రం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. వ్యాపారానికి అవరోధంగా తయారైన చట్టాలు లేదా నిబంధనలు 2,875 దాకా ఉన్నాయని గుర్తించిన ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వాటిల్లో 2007 చట్టాలను, లేదా నిబంధనలు పూర్తిగా రద్దు చేసింది! అదేవిధంగా దీర్ఘకాలిక పరిష్కార అన్వేషణలో భాగంగా 20 వేల వరకు  అనవసర ప్రక్రిల తొలగింపునకు వినూత్న చర్యలు తీసుకుంది. వ్యాపారాలలోకి పెట్టుబడులను ప్రోత్సహించేందుకు పెట్టుబడిదారుల కోసం ఏక గవాక్ష అనుమతుల విధానం ప్రవేశపెట్టింది. వ్యాపారానికి అవసరమైన ఆమోద, అనుమతుల సంఖ్య 14 నుంచి 3కు తగ్గించింది! వ్యాపార ఆర్థిక సంస్కరణల విషయానికి వస్తే జి.ఎస్‌.టి. అమలు భారత్‌ సాధించిన పెద్ద ముందడుగు.

ఒకప్పుడు వస్తువు ఒకటే అయినా దాని ధర రాష్ట్రానికో రకంగా మారిపోయేది! ఐదేళ్ల క్రిందట జి.ఎస్‌.టి. అమలులోకి రావడంతో దేశం ఏకీకృత పన్ను విధానంలోకి పాదం మోపింది. ‘ఆక్ట్రాయ్‌’, ‘నాకా’ల రద్దుతో వ్యాపారులకు పన్ను పత్రాల దాఖలు సులభమైంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపైన కూడా ప్రభుత్వం నిబంధనలను గణనీయంగా సంస్కరించింది. వాణిజ్య సౌలభ్యం విషయంలో 2014 నాటికి 142వ స్థానంలో ఉన్న భారతదేశం 2020 నాటికల్లా 63వ స్థానానికి దూసుకెళ్లింది. ఇదే దూకుడును ఇకముందు మరింతగా కొనసాగించాలని ఈ అమృతోత్సవాల సందర్భంగా ప్రభుత్వం కంకణం కట్టుకుంది.
చదవండి: ఇండియా@75: భారత్‌కు తొలి మహిళా రాష్ట్రపతి

మరిన్ని వార్తలు