హాకీ స్టిక్‌ మాంత్రికుడు: ద్యాన్‌ చంద్‌ /1905-1979

23 Jul, 2022 09:58 IST|Sakshi

1936 నాటి బెర్లిన్‌ ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌ విభాగంలో జెస్సీ ఒవెన్‌ సాధించిన ఘనత గురించి ఇప్పటికీ ప్రశంసల వర్ష కురిపిస్తాం. అప్పటి నాజీ ధోరణులపై ఆయన పైచేయి సాధించినట్లు భావిస్తాం. మరి ధ్యాన్‌ చంద్‌ గురించి ఏం చెప్పుకోవాలి? ఆయన అంతకు మునుపటి రెండు ఒలింపిక్స్‌లో 20 గోల్స్‌ సాధించడమే కాక, బెర్లిన్‌లో సైతం తన సత్తా చాటారు. ఫైనల్‌లో జర్మనీ జట్టుపై మూడు గోల్స్‌ చేశారు. ధ్యాన్‌చంద్‌ ప్రపంచంపై చూపిన ప్రభావంపై సమగ్ర పరిశోధన జరగాల్సి ఉంది.

‘‘కేవలం చదవడం, రాయడమే’’ వచ్చిన ఈ సాధారణ భారతీయుడు ప్రపంచ హాకీ భవిష్యత్తునే తిరగరాశారు. హాకీ జట్టు మూడోసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నప్పుడు బెర్లిన్‌ ఒలింపిక్స్‌కు భారత హాకీ జట్టు కెప్టెన్‌గా ధ్యాన్‌ చంద్‌ నియమితులయ్యారు. నిజం చెప్పాలంటే, తొలిసారిగా ఒలింపిక్స్‌లో పాల్గొన్నప్పటి కన్నా ఇలా కెప్టెన్‌గా నియమితం కావడమే ధ్యాన్‌ చంద్‌ జీవితంలోని అత్యున్నత సంఘటన. ‘ఫ్రీడమ్‌ ఎట్‌ మిడ్‌నైట్‌’ పుస్తక రచయితల మాటల్లో చెప్పాలంటే.. ‘ప్రపంచంలోని అతి పెద్ద విడాకులు’ అయిన భారతదేశ విభజన సందర్భంగా చివరకు ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫర్నీచర్‌ను సైతం లెక్కపెట్టి, భారత పాకిస్థాన్‌ల మధ్య పంచుకున్నారు.

అయితే బ్రిటిష్‌ భారతావని లేదా అవిభక్త భారతదేశంగా ఒలింపిక్స్‌లో భారత్‌ సాధించిన మూడు స్వర్ణాలూ తటస్థమైనవేనని ప్రకటించారు. 1936 నాటి బెర్లిన్‌ ఒలింపిక్స్‌నే తీసుకుంటే భారతహాకీ జట్టులోని 18 మందిలో పాకిస్థాన్‌ నుంచి ఇద్దరు హిందువులు, నలుగురు ముస్లిములు, ఎనిమిది మంది ఆంగ్లో ఇండియన్‌లు ఉన్నాయి. అయితే «ధ్యాన్‌ చంద్‌ ఆట నైపుణ్యంతో పోలిస్తే ఆ 14 మందీ తక్కువే కావడంతో, స్వతంత్ర భారతావనే ఆ మానసిక యుద్ధంలో విజయం సాధించింది. ఆత్మకథ అయిన ‘గోల్‌’లోమాత్రం ధ్యాన్‌చంద్, ‘‘ఆత్మకథ రాసేంతగా నేను మరీ ముఖ్యమైన వ్యక్తినేమీ కాదు’’ అని సవినయతను కనబరిచారు. అలాంటి గొప్ప వ్యక్తి భారత జాతి ప్రతిపత్తిని నిరంతం ప్రకాశవంతం చేస్తూనే ఉంటారు. 
– కె.ఆర్ముగం, భారత హాకీ అంశాలపై నిపుణులు 

(చదవండి: మొనగాళ్లకు మొనగాడు )

మరిన్ని వార్తలు