శతమానం భారతి: అంతరిక్షం

5 Aug, 2022 18:00 IST|Sakshi

అంతరిక్ష రంగంలో భారత్‌ సామర్థ్యాలు విస్తరిస్తున్నాయి. ఇందుకు కళ్లముందరి నిదర్శనాలు అనేకం. ఒకే అంతరిక్ష వాహక నౌక నుంచి రికార్డు స్థాయిలో భారత్‌ 104 ఉపగ్రహాలను ప్రయోగించింది. అలాగే ఒకే అంతరిక్ష వాహక నౌక నుంచి 3 ఆర్బిట్‌ మిషన్లు పంపడం కూడా ఒక రికార్డే. అమిత వేగవంతమైన కమ్యూనికేషన్‌ సేవలు పెంచడానికి భారత్‌ అత్యంత ఆధునాతనమైన జిశాట్‌–11, జిశాట్‌ 29 ఉపగ్రహాలు ప్రయోగిం చింది. గత ఎనిమిదేళ్ల కాలంలోనే రికార్డు సంఖ్యలో అంతరిక్ష ప్రయోగాలు జరిగాయి.

2014 ముందు ఏడాదికి సగటున 1.7 అంతరిక్ష యాత్రలు జరగ్గా, 2014 తర్వాత ఆ సంఖ్య ఏడాదికి 5.4 కి పెరిగింది. ఈ ఎనిమిదేళ్లలోనే భారత్‌ 306 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. ఇదే సమయంలో భారతదేశానికి సొంత ఉపగ్రహ నావిగేషన్‌ వ్యవస్థ అభివృద్ధి చేసుకునే సామర్థ్యం సమకూరింది. వాణిజ్య పరమైన అంతరిక్ష ప్రయాణాల విభాగంలోనూ భారతదేశాన్ని ప్రపంచ నాయకత్వ స్థాయికి పెంచే సంకల్పంతో ఇండియన్‌ స్పేస్‌ అసోసియేషన్‌ ప్రారంభం అయింది.

ప్రగతి శీలమైన అంతరిక్ష సంస్కరణలు, కార్యక్రమాలు, యాత్రల ద్వారా భారతదేశం అంతరిక్ష రంగంలో ఒక సూపర్‌ పవర్‌గా అవతరిస్తోంది. ఇందుకు అవసరమైన చేయూతను దేశవాళీ ‘ఇన్‌–స్పేస్‌’ అందిస్తోంది. ఒక ప్రోత్సాహక, ఉత్తేజకరమైన, అధీకృత, పర్యవేక్షక బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఆకాశమే హద్దుగా అమృతోత్సవాలను జరుపుకోడానికి ఇంతకన్నా తగిన తరుణం ఏముంటుంది?.

(చదవండి: మహోజ్వల భారతి: ఈస్టిండియా ఉరికి వేలాడిన తొలి భారతీయుడు)

మరిన్ని వార్తలు