స్వతంత్ర భారతి : భారత్‌ తొలి మహిళా నాయకురాలు

20 Jun, 2022 08:58 IST|Sakshi

ప్రధాని పీఠంపై ఇందిర: అది 1966 జనవరి 19 వ తేదీ. భారతదేశ కొత్త నాయకురాలి ప్రసంగం ఇలా సాగింది. ‘‘ఈ క్షణాన మీ ముందు నిలచిన నాలో, మహా నాయకుల గురించిన ఆలోచనలు ముప్పిరిగొంటున్నాయి. నేను మహాత్మా గాంధీ పాదాల చెంత పెరిగాను. నా తండ్రి పండిట్‌జీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి – వారు నా మార్గదర్శకులు. వారు నడిచిన మార్గంలో నేనూ నడవాలనుకుంటున్నాను’’ అని. ఈ నెహ్రూ కుమార్తె.. ప్రధానమంత్రి పదవిని చేపట్టాక అసమాన ఆత్మబలం ఉన్న నాయకురాలిగా రూపొందారు.

క్షీర విప్లవం: 1966లో గుజరాత్‌లోని కొద్ది మంది గ్రామస్థులు, 275 లీటర్ల ప్రాసెసింగ్‌ ప్లాంట్‌తో ప్రారంభమైన ప్రయత్నం 23 రాష్ట్రాల్లోని 170 జిల్లాలకు, 90 వేల గ్రామ సహకార సంఘాలకు విస్తరించింది. స్ఫూర్తిదాయకమైన వర్ఘీస్‌ కురియన్‌ నాయకత్వం.. భారతదేశాన్ని పాడి ఉత్పత్తుల కొరత నుంచి సమృద్ధికి చేర్చింది. ఈ విప్లవ ఉత్పత్తుల బ్రాండ్‌ పేరు ‘అమూల్‌’ అన్న సంగతి తెలిసిందే.
(చదవండి: శతమానం భారతి విదేశీ వాణిజ్యం)

మరిన్ని వార్తలు