స్వతంత్ర భారతి: నయా పైసలొచ్చాయి!

11 Jun, 2022 13:12 IST|Sakshi

1957/2022

అణా బ్రిటిష్‌ పాలనలోని మారక ద్రవ్య ప్రమాణం. ఒక రూపాయికి 16 అణాలు. ఒక అణాకు 6 పైసలు. అర్దణా అంటే మూడు పైసలు. ఈ విధానం ఇండియాకు స్వాతంత్య్రం వచ్చాక కూడా కొనసాగింది. 1957లో నెహ్రూ ప్రభుత్వం దశాంక విధానం అమలులోకి తెచ్చింది. రూపాయికి 100 నయా పైసలుగా నిర్ణయించింది. 1964లో ’నయాపైస’ను ’పైస’గా పేరు మార్చారు. ఇప్పటికీ 25 పైసలను ’నాలుగు అణాలు’ అనీ, 50 పైసలను ’ఎనిమిది అణాలు’ అనీ వాడటం అనేక ప్రాంతల్లో కనబడుతుంది.

1/12 అణా (అణాలో 12వ భాగం లేదా దమ్మిడీ); 1/4 అణా (అణాలో 4వ భాగం, కానీ లేదా పావు అణా); 1/2 అణా (అణాలో సగభాగం లేదా పరక); అణా (6 పైసలు లేదా 1/16 రూపాయలు);  2 అణాలు (12 పైసలు లేదా బేడ); 1/4 రూపాయి (4 అణాలు లేదా పావలా); 1/2 రూపాయి (8 అణాలు లేదా అర్ధ రూపాయి).

మరిన్ని వార్తలు